దురదృష్టవంతులకు శాపం.. టీటీడీ నిర్ణయం!

‘అంతా బాగున్న భాగ్యశీలురను అందరూ నెత్తిన పెట్టుకుంటారు. వారికి మరింత సేవలు చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఏమీ దిక్కులేని నిర్భాగ్యులను వారి మానాన వారిని వదిలేస్తారు.. వారిని చులకనగా చూస్తారు..’ ఇది లోకరీతి! తిరుమల…

‘అంతా బాగున్న భాగ్యశీలురను అందరూ నెత్తిన పెట్టుకుంటారు. వారికి మరింత సేవలు చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఏమీ దిక్కులేని నిర్భాగ్యులను వారి మానాన వారిని వదిలేస్తారు.. వారిని చులకనగా చూస్తారు..’ ఇది లోకరీతి! తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారి శ్యామలరావు తీరు కూడా ఇందుకు భిన్నంగా ఎంతమాత్రమూ లేదు! లడ్డూల విక్రయం విషయంలో టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాలు తలాతోకాలేకుండా ఉంటున్నాయి.

తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులకు ఒక్కొక్కరికి 5 లడ్డూలు మించి ఇచ్చేది లేదని.. దర్శనం కూడా చేసుకోని భక్తులకు ఆధార్ కార్డు చూపిస్తే రెండు లడ్డూలు మాత్రం ఇస్తామని కొన్ని రోజుల కిందట ఈవో శ్యామల రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ వైఖరిలో ఉన్న లోపాలను ప్రస్తావిస్తూ గ్రేట్ ఆంధ్ర డాట్ కామ్ అదే రోజున.. ‘పిచ్చి కుదిరితేరోకలి తలకు చుట్టమన్నాట్ట’ అనే శీర్షికతో ఒక కథనం ప్రచురించింది. అసలు టీటీడీ నిర్ణయం చాలా వివాదాస్పదం కావడంతో.. శ్యామలరావు అందులో కొన్ని సవరణలు చేశారు. లేదా, నిర్ణయంపై మరింత స్పష్టత ఇచ్చారు.

తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న భక్తులకు ఒక్క టికెట్ మీద ఎన్ని లడ్డూలైనా తీసుకోవచ్చునని.. దర్శనం చేసుకోని భక్తుడు మాత్రం ఆధార్ కార్డు చూపిస్తే కేవలం రెండు లడ్డూలు మాత్రం ఇస్తామని ఆయన ప్రకటించారు. కేవలం బ్లాక్ మార్కెటింగ్ ను అరికట్టడానికే ఇలా చేస్తున్నాం అని కూడా అంటున్నారు.

టీటీడీ ఈవో తీరు పైన చెప్పుకున్న సామెత చందంగానే ఉంది. దర్శనం దొరికిన అదృష్టశీలి ఎన్ని లడ్డూలైనా తీసుకువెళ్లవచ్చు. ఎంతో దూరప్రాంతాల నుంచి కష్టనష్టాల కోర్చి వచ్చిన సామాన్య భక్తుడికి దర్శనం కూడా గతిలేకుండా పోతే.. చివరికి లడ్డూలు కూడా దొరకవు.

దురదృష్టవంతుడిని టీటీడీ యాజమాన్యం కూడా చిన్నచూపే చూస్తుందన్నమాట. బ్లాక్ మార్కెట్ అరికట్టడానికి ఇతర పద్ధతులేమిటో టీటీడీ పరిశీలించాలి గానీ.. భక్తులకు విక్రయించే విషయంలో ఇలాంటి అర్థం పర్థం లేని రూల్సు తీసుకురావడం వల్ల.. భక్తులను మనస్తాపానికి గురిచేయడం తప్ప సాధించేదేమీ లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.

12 Replies to “దురదృష్టవంతులకు శాపం.. టీటీడీ నిర్ణయం!”

  1. Yentho duram nundi kastanastalatho vachinna darshanam cheskokunda evaraina velthara asalu. Main point thirumalaki velledi darshanam kosamae aa tarvathe prasadam ayina edaina. GA nuvuu egg mida hair pikadam aapesthe better inko 5 years varaku.

  2. అరాచకం ఉన్న చోట దేముడు ఉంటాడా? ఎన్నో సంత్సరాలుగా ఇది “తిరుడా” పతి అయ్యింది. మన జీవమే దేవుడికి షోడశోపచార పూజ అన్నారు మహానుభావులు. అది తెలుసుకోండి

    1. అసలు ఇక్కడ రాసే ఆర్టికల్స్ చూసి అమెరికా ప్రెసిడెంట్ కూడా డెసిషన్ తీసుకుంటారు….

Comments are closed.