వైఎస్సార్‌కు నిజ‌మైన నివాళి అప్పుడే జ‌గ‌న్‌!

వైఎస్సార్ జ‌యంతి, వ‌ర్ధంతి స‌మ‌యాల్లో ఆయ‌న త‌న‌యుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో పాటు కుటుంబ స‌భ్యులంతా ఇడుపుల‌పాయ‌కు వెళ్తుంటారు. వైఎస్సార్ స‌మాధి వ‌ద్ద ప్రార్థ‌న‌లు నిర్వ‌హించి, ఆయ‌న‌కు ఘ‌నంగా నివాళుల‌ర్పిస్తుంటారు. ఇవ‌న్నీ లోకం కోసం చేస్తున్న‌ట్టు…

వైఎస్సార్ జ‌యంతి, వ‌ర్ధంతి స‌మ‌యాల్లో ఆయ‌న త‌న‌యుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో పాటు కుటుంబ స‌భ్యులంతా ఇడుపుల‌పాయ‌కు వెళ్తుంటారు. వైఎస్సార్ స‌మాధి వ‌ద్ద ప్రార్థ‌న‌లు నిర్వ‌హించి, ఆయ‌న‌కు ఘ‌నంగా నివాళుల‌ర్పిస్తుంటారు. ఇవ‌న్నీ లోకం కోసం చేస్తున్న‌ట్టు అనిపిస్తోంది. ఇవాళ వైఎస్సార్ 15వ వ‌ర్ధంతి. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దంప‌తులు, వైఎస్ స‌తీమ‌ణి విజ‌య‌మ్మ త‌దిత‌ర కుటుంబ స‌భ్యులు ఆ మ‌హానేత‌కు ఘ‌నంగా నివాళుల‌ర్పించారు.

అయితే వైఎస్సార్‌కు నిజ‌మైన నివాళి ఇదేనా? అనే ప్ర‌శ్న ఉద‌యిస్తోంది. వైఎస్సార్ ఆలోచ‌న‌ల‌కు, ఆశ‌యాల‌కు అనుగుణంగా న‌డుచుకున్న‌ప్పుడే ఆయ‌న‌కు నిజ‌మైన నివాళి అనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. జ‌గ‌న్‌పై ప్ర‌ధాన విమ‌ర్శ‌… వైఎస్సార్‌లా కాద‌ని. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఎంతో ఆప్యాయంగా ప్ర‌తి ఒక్క‌రితో మాట్లాడేవార‌ని, క‌ష్ట‌నష్టాల‌ను తెలుసుకుని అండ‌గా నిల‌బ‌డే వార‌ని వైఎస్‌ను ఇప్ప‌టికీ రాజ‌కీయాల‌కు అతీతంగా కొనియాడుతుంటారు.

కానీ వైఎస్సార్‌తో పోల్చుకుంటే జ‌గ‌న్‌లో మాన‌వీయ కోణం త‌క్కువ‌నే మాట వినిపిస్తోంది. మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్ సీఎం అయిన త‌ర్వాత ఏ ఒక్క‌రికీ అందుబాటులో లేకుండా, ఐదేళ్ల పాటు ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులు, ఇద్ద‌రు ముగ్గురు వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుల‌తో మాత్ర‌మే మాట్లాడుతూ పాల‌న సాగించార‌ని సొంత పార్టీ నాయ‌కులు సైతం విమ‌ర్శిస్తున్నారు. క్షేత్ర‌స్థాయిలో అస‌లేం జ‌రుగుతున్న‌దో కూడా తెలుసుకోకుండా, అంధ‌త్వంతో పాల‌న సాగించ‌డం వ‌ల్లే ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌క‌ట్టుకున్నార‌ని వైసీపీ శ్రేణులు మండిప‌డుతున్నాయి.

ఇదే వైఎస్సార్ సీఎంగా ఉన్న‌ప్పుడు ప్ర‌తిరోజూ ఉద‌యాన్నే వంద‌లాది మంది సామాన్య ప్ర‌జానీకాన్ని క‌లిసి, వారికి చేత‌నైన సాయం అందించిన త‌ర్వాతే మిగిలిన ప‌నులు చూసుకునే వార‌ని గుర్తు చేస్తున్నారు. రాజ‌కీయ నాయ‌కుడు, పాల‌కుడు ఎలా వుండాలో క‌ళ్లెదుటే తండ్రి రూపంలో నిలువెత్తు ఉదాహ‌ర‌ణ పెట్టుకుని, జ‌గ‌న్ ఏమీ నేర్చుకోలేద‌ని ఇప్ప‌టికీ ఆయ‌న‌పై మండిప‌డుతున్నారు. అలాగే వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల యోగ‌క్షేమాల్ని ప‌ట్టించుకోవ‌డంలో జ‌గ‌న్ త‌న తండ్రి బాట‌లో అస‌లు న‌డ‌వ‌లేదు.

వైఎస్సార్‌కు నివాళి అర్పించ‌డం అంటే, ఆయ‌న‌లా ప్ర‌జారంజ‌కంగా న‌డుచుకోవ‌డమే అని జ‌గ‌న్‌కు హిత‌వు చెబుతున్నారు. ఇవ‌న్నీ జ‌గ‌న్ తెలుసుకుంటే త‌ప్ప‌, ఆయ‌న‌కు, వైసీపీకి భ‌విష్య‌త్ వుండ‌ద‌నేది వాస్త‌వం.

11 Replies to “వైఎస్సార్‌కు నిజ‌మైన నివాళి అప్పుడే జ‌గ‌న్‌!”

  1. భావిశ్యతా..అలాంటివేమీ లేదు..వాడికి వైఎస్ఆర్ కు పోలికా..సిగ్గుచేటు..

  2. అల్లా YSRx ని అనుసరించినందుకేగా సొంత బాబాయి (writer ఇజయలక్షిమి బుద్ధికి ఇది తెలియడం లేదు)ని ఆ తండ్రి వద్దకే పంపింది. వారిలాగే, వారి నీడ క్రిందనే ఉంటే జగనన్న గొప్పతనం ఏముంటుంది.

  3. అల్లా YSRx ని అనుసరించినందుకేగా సొంత బాబాయి (writerr ఇజయలక్షిమి బుద్ధికి ఇది తెలియడం లేదు)ని ఆ తండ్రి వద్దకే పంపింది. వారిలాగే, వారి నీడ క్రిందనే ఉంటే జగనన్న గొప్పతనం ఏముంటుంది.

  4. నీ కష్టం పగ వాడికి కూడా వద్దు GA…. ఒక పక్క ప్రజలకు మంచి చేస్తున్నాడని పవన్ మీద ఏడుస్తావ్….ఇంకో పక్క మన అన్నీయకు ఏమీ చేతకాదని ఏడుస్థావ్….అసలు ఏంటో నీ బాధ…..

Comments are closed.