నడిరోడ్డుపై ఎదైనా గొడవ జరుగుతుంటే చాలా మంది చూసి చూడనట్లు వెళ్ళిపోతారు.. మరి కొంత మంది అయితే ఆ గొడవను తమ ఫోన్స్ లో వీడియోలు తీసి సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతారు. కానీ యంగ్ హీరో నాగ శౌర్య రియల్ హీరో అనిపించుకున్నారు. అసలేం జరిగిందంటే.. శౌర్య కారులో వెళ్తుండగా.. నడిరోడ్డుపై ఒక యువకుడు.. తన లవర్ పై చేయి చేసుకున్నాడు. ఇది చూసిన నాగ శౌర్య కారు దిగి.. సదురు యువకుడిని అడ్డుకున్నాడు.
నడిరోడ్డుపై అమ్మాయిని కొడతావా.. ఆ అమ్మాయికి సారీ చెప్పు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఆ యువకుడు ఆమె నా లవర్ నా ఇష్టం అంటూ దురుసుగా ప్రవర్తించాడు. దాంతో కోపంతో ఊగిపోయిన శౌర్య ఆ అమ్మాయి నీ లవర్ అయితే మాత్రం రోడ్డు మీద అమ్మాయిని కొడతావా అంటూ ఆ యువకుడిని నిలదీశాడు. చుట్టు ఉన్నవారు సైతం ఆ యువకుడును నిలదీయడంతో చివరికి ఆ అమ్మాయికి సారీ చెప్పాడు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన కొందరు శౌర్యపై ప్రశంసలు కురిపిస్తు రియల్ హీరో అని అంటుంటే.. మరికొందరు వాడి లవర్ వాడు కొట్టుకుంటాడు నీకేందుకు అంటూ కామెంట్లు చేస్తున్నారు.