చిలసౌ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది రుహానీ శర్మ. తొలి సినిమాకు మంచి అప్లాజ్ వచ్చినా, పెద్దగా అవకాశాలు రాలేదు. తొలి సినిమాలో అంత గ్లామరస్ రోల్ కాకపోవడంతో, ఇండస్ట్రీ దృష్టి ఆమెపై అంతగా పడలేదు. అయితే ఇటీవల చిన్న, మీడియం హీరోయిన్ల కోసం వెదుకులాట ఎక్కువయ్యాక రుహానీకి ఆఫర్లు స్టార్ట్ అయ్యాయి. ఈ వారం విడుదల కాబోతున్న హిట్ సినిమాలో ఆమే కథానాయిక.
ఇప్పుడు మరో అవకాశం వచ్చింది రుహానీకి. నిర్మాత మహేష్ కోనేరు హీరో నాగశౌర్యతో నిర్మించబోయే సినిమాకు ఆమెను హీరోయిన్ గా తీసుకునే ఆలోచన చేస్తున్నారు. ఈ సినిమాకు రాజా దర్శకుడు. ఈ సినిమా 28న ప్రారంభిస్తున్నారు.ఈ సినిమాకు సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం, మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం నాగశౌర్య సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో సౌజన్య దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేసారు. అవసరాల శ్రీనివాస్ డైరక్షన్ లో పీపుల్స్ మీడియా సినిమా సగం వరకు పూర్తయింది. శరద్ మరార్ తదితరులు సుబ్రహ్మణ్యపురం డైరక్టర్ సంతోష్ తో చేయబోయే సినిమా కూడా ఫిక్స్ అయి వుంది.