శీనయ్య ఆగిపోయినట్లే..?

సీనియర్ డైరక్టర్ వివి వినాయక్ కీలకపాత్రలో నిర్మాత దిల్ రాజు హడావుడిగా, అట్ట హాసంగా ప్రారంభించిన ప్రాజెక్టు శీనయ్య. ఈ సినిమా ప్రారంభించిన నాటి నుంచీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతూనే వుంది. ముందుగా డైరక్టర్…

సీనియర్ డైరక్టర్ వివి వినాయక్ కీలకపాత్రలో నిర్మాత దిల్ రాజు హడావుడిగా, అట్ట హాసంగా ప్రారంభించిన ప్రాజెక్టు శీనయ్య. ఈ సినిమా ప్రారంభించిన నాటి నుంచీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతూనే వుంది. ముందుగా డైరక్టర్ తెచ్చిన స్క్రిప్ట్ ను రిపేర్ చేయడం ప్రారంభించారు. తరువాత దర్శకుడిగా అనుభవం వున్న వినాయక్ కూడా అందులో ఇన్ వాల్వ్ కావడం ప్రారంభమైంది.

కానీ స్క్రిప్ట్ మాత్రం సంతృప్తికరంగా రాలేదు. సరే, తన ఇన్ పుట్స్ వదిలేసి, మంచి స్క్రిప్ట్ మీరే చేయించండి అని వినాయక్ బాల్ ను నిర్మాత దిల్ రాజు కోర్టులోనే వదిలేసారు. అయినా పెద్దగా అడుగు ముందుకు కదలలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు అంటే బుధవారం కూడా ఓ సిట్టింగ్ వేసారు.

మరొక్కసారి ట్రయ్ చేసి, స్క్రిప్ట్ కుదరకుంటే ప్రాజెక్టు వదిలేద్దామనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వినాయక్ అంటే దిల్ రాజుకు ప్రత్యేకమైన అభిమానం. అలాగే, ప్రెస్టీజియస్ గా అట్టహాసంగా ప్రారంభించారు. అందువల్ల ఆపడం అన్నది ఇష్టం లేకపోతోంది ఆయనకు. కానీ దాదాపు ప్రాజెక్టు ఆగిపోయినట్లే అని వార్తలు అందుతున్నాయి.

బాధపడుతున్న వంశీ పైడిపల్లి