యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో తయారవుతున్న సినిమా ‘ఒరేయ్ బుజ్జిగా…`. ఉగాది కానుకగా మార్చి 25 విడుదలవుతుంది. రీసెంట్‌గా ఈ చిత్రం నుండి అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో అర్మాన్ మాలిక్, పి.మేఘన ఆలపించిన ‘కురిసెన.. కురిసెన.. తొలకరి వలపులె మనసున..మురిసెన.. మురిసెన.. కలలకి కనులకి కలిసెన..’ సాంగ్ ని విడుదల చేసారు. ఈ సాంగ్ మేకింగ్ వీడియోను ఇప్పుడు విడుదల చేసింది చిత్రయూనిట్.
సందర్భంగా యంగ్ హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ – ఈ మధ్య కాలంలో వన్ ఆఫ్ బెస్ట్ లోకేషన్స్‌లో చిత్రీకరించిన లవ్‌లీ డ్యూయెట్ ఇది. కచ్చితంగా ఐ.ఆండ్రూ ఫోటోగ్రఫీ ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్ అవుతుంది“ అన్నారు.
హీరోయిన్ మాళవిక నాయర్ మాట్లాడుతూ – “ చిత్రంలో ఓ మంచి సిట్యుయేషన్‌లో వచ్చే ఫస్ట్ సాంగ్ ఇది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఐ.ఆండ్రూ ఈ పాటను అందమైన లొకేషన్లలో చిత్రీకరించారు` అన్నారు.
చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ – ‘‘కురిసెన.. కురిసెన` పాట విడుదలైన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. పాట ఎంతో బాగుందంటూ నా మిత్రులు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. ఈ పాటకు వచ్చిన క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు సాంగ్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేస్తున్నాం. పాట మాదిరిగానే ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను. ’’ అన్నారు.