నమ్మకం..ప్రేమ..కలిస్తే ‘లవ్ యూ రామ్’

ఫ్యామిలీ ఎమోషన్లతో కూడిన లవ్ స్టోరీలు రాయడంలో దర్శకుడు దశరథ్ దిట్ట. ఆయన స్టోరీతో తయారవుతున్న సినిమా లవ్ యూ రామ్. డివై చౌదరి దర్శకుడు. కథకుడు..దర్శకుడు ఇద్దరూ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.…

ఫ్యామిలీ ఎమోషన్లతో కూడిన లవ్ స్టోరీలు రాయడంలో దర్శకుడు దశరథ్ దిట్ట. ఆయన స్టోరీతో తయారవుతున్న సినిమా లవ్ యూ రామ్. డివై చౌదరి దర్శకుడు. కథకుడు..దర్శకుడు ఇద్దరూ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. సినిమాలో రోహిత్ బెహాల్..అపర్ణ జనార్ధన్ జంటగా నటిస్తున్నారు. సినిమా కాన్సెప్ట్, హీరో క్యారెక్టర్ డిజైన్ వెల్లడించేలా టీజర్ ను కట్ చేసారు.

అమాయకంగా ప్రేమించే అమ్మాయిగా హీరోయిన్, ఎదుటి వారిని నమ్మించి తన పనులు సాగించుకునే కుర్రాడిగా హీరో కనిపించారు. ఇలాంటి ఇద్దరి చుట్టూ అల్లుకున్న సంఘటనలు, ప్రేమలు, నమ్మకాలు, వంచనలు అన్నీ కలిసి కథ అల్లుకున్నట్లు కనిపిస్తోంది. ‘ప్రేమించడం సులువు..నమ్మకం పొందడం కష్టం’ అనే కాన్సెప్ట్ అసలు థ్రెడ్. టీజర్ చిన్నదే అయినా దాని నిండా దశరథ్ మార్క్ ఎమోషన్లు పరుచుకున్నాయి.

ఈ సినిమాకు సాయి సంతోష్ సినిమాటోగ్రఫీ, కే వేదా సంగీతం అందిస్తున్నారు. దశరథ్, చౌదరి నిర్మాతలు