పవన్ కళ్యాణ్ రాజకీయం- ఆర్జీవీ సినిమా

కొంతమందికంతే..బజ్ ఉంటుంది కానీ బిజినెస్ ఉండదు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో హిట్టే కానీ రాజకీయాల్లో మాత్రం దారుణమైన ఫట్టు. అతని రాజకీయమంతా అర్థం లేని ట్వీట్లకి, విషయం లేని స్పీచులకి, చిరాకు పుట్టించే చేష్టలకి…

కొంతమందికంతే..బజ్ ఉంటుంది కానీ బిజినెస్ ఉండదు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో హిట్టే కానీ రాజకీయాల్లో మాత్రం దారుణమైన ఫట్టు. అతని రాజకీయమంతా అర్థం లేని ట్వీట్లకి, విషయం లేని స్పీచులకి, చిరాకు పుట్టించే చేష్టలకి పరిమితం. అలాగని జనం పట్టించుకోరా అంటే పట్టించుకుంటారు. పట్టించుకున్నట్టే ఉంటారు. అభిమానుల ఈలలు, జనసైనికుల సందోహాలు ఉంటాయి. కానీ అవేవీ ఓట్లుగా మారవన్నది జనమెరిగిన సత్యం. 

మనసులో పసుపుపచ్చ మీద ప్రేమున్నా ఇప్పుడు కొత్తగా మిలిటరీ పచ్చ మీద పడ్డాడు పవన్. ఆ రంగు ప్రచారవాహనం తాలూకు వీడియోలు, ఫోటోలు ట్విట్టర్లో వదిలాడు. అవి చర్చనీయాంశమైనాయి. 

మిలిటరీ గ్రీన్ సివిల్ బాహనాలకి వాడకూడదన్నది రూల్. ఆ రూల్ ప్రస్తావనకు తేగానే వెరైటీ ట్వీట్లు పెట్టి తన అజ్ఞానాన్ని, మూర్ఖత్వాన్ని చాటుకున్నాడు. 

అదే రంగులో ఉన్న ఒక సివిల్ కారుని పోస్ట్ చేసి “రూల్స్ ఒక్క పవన్ కళ్యాణ్ కే” అంటూ ట్వీట్ చేసాడు. కాస్త కళ్లు పెట్టి చూస్తే తెలుస్తుంది. అసలా కారుకున్న రిజిస్ట్రేషన్ నెంబర్ ఇండియాది కాదని. పైగా స్టీరింగు ఎడం వైపున ఉంది. అంటే కచ్చితంగా అది విదేశీయ కారే. ఈ మాత్రం బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా పార్టీ హెడ్డుగా ఎలా పనిచేస్తున్నాడో ఏంటో! పైగా లక్షలాది పుస్తకాలు చదివానంటాడు కనీస పరిశీలనాశక్తి కూడా లేని ఈ పవరుస్టారుడు. 

దీనికి మరొక కొనసాగింపు కూడా ఇచ్చాడు ట్విట్టర్లో. “నైబర్స్ ఎన్వీ, ఓనర్స్ ప్రైడ్” అని ఓనీడా యాడ్ క్యాప్షన్ పెట్టి గిట్టని వాళ్లు తన కారుని చూసి కుళ్లుకుంటున్నారని వివరణ ఇస్తూ శునకానందపడుతున్నాడు. ఇదంతా చూస్తుంటే మూర్ఖత్వం, మూఢత్వం అతని బుర్రలో ఎలా పేరుకుపోయిందో అర్థమౌతుంది. 

కాస్త పరిశీలించి చూస్తే పవన్ కళ్యాణ్ రాజకీయానికి, ఆర్జీవీ ప్రస్తుత సినిమాలకి పోలికుందనిపిస్తుంది. ఈయనా అంతే. చిరాకు పుట్టించే పనులు చేస్తుంటాడు. ప్రచారం కోసం అమ్మాయి పాదాలు చీకుతాడు, తొడల పూజ చేస్తాడు, ఒకమ్మాయి వెనుకభాగం బాగుందంటాడు..ఇంకా అసహ్యమైన పనులు చాలానే చేస్తుంటాడు. ఏవిటి ఈ అసహ్యం అంటే పవన్ కళ్యాణ్ అన్నట్టుగానే సమాజమంతా తన స్వేచ్ఛని చూసి కుళ్లుకుంటోందనే అర్థమొచ్చేలా మాట్లాడతాడు.  విమర్శిస్తున్నవాళ్లది అసహ్యం కాదు అసూయ అనుకోవడం ఒకానొక మానసిక దురవస్థ అంతే.

అయితే ఈ హడావిడంతా తాను ప్రచారం కోసమే చేస్తుంటానని గర్వంగా చెబుతాడు. ఆఖరికి అషురెడ్డి పాదాలు చీకుడు గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా తానది చేసింది ప్రచారం కోసమే అన్నాడు. ఎంత ప్రచారం చేసినా పవన్ కళ్యాణ్ కి ఓట్లు రాలనట్టు ఈ ఆర్జీవికి కలెక్షన్స్ రావు.

ఈ వారం డేంజరస్ అనే సినిమాని థియేటర్లలోకి వదిలాడు. కథ, కథనం, కథాంశం తర్వాత అసలు ముందు చేసిన ప్రచారానికి ఓపెనింగ్స్ రావాలి కదా? ఎన్ని థియేటర్స్ లో వేస్తే ఎంతమందొచ్చారు? ఎక్కువ థియేటర్స్ దొరికుండకపోవచ్చు. కనీసం విడుదల చేసినన్ని థియేటర్సులో అయినా జనం హౌస్ఫుల్ చేయాలిగా? అది జరగనప్పుడు ఎందుకొచ్చిన జుగుప్సాకరపు ప్రచార కార్యక్రమాలు!

మితిమీరిన తెలివి, అశ్రద్ధ, నా ఇష్టం అనే ధోరణుల వల్ల ఆర్జీవీ సినిమా మేకింగ్ పతమైపోతే..మూర్ఖత్వం, విషయశూన్యత, వెర్రితనం వల్ల పవన్ కళ్యాణ్ రాజకీయం చతికిలపడింది. 

చివరిగా చెప్పేదేంటంటే, ఆర్జీవీ టీవీ ఇంటర్వ్యూల్లోనే హిట్టు… సినిమాలు తీయడంలో ఫట్టు.  పవన్ కళ్యాణ్ సినిమాల్లో హిట్టు.. రాజకీయాల్లో ఫట్టు. రిపేరయ్యే పరిస్థితి ఇద్దరిలోనూ కనిపించడం లేదు. 

హరగోపాల్ సూరపనేని