నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందా?

నంద‌మూరి బాల‌కృష్ణ వార‌సుడు మోక్ష‌జ్ఞ వెండితెర అరంగేట్రం గురించి చాల రోజుల నుండి చ‌ర్చ జ‌రుగుతోనే ఉంది. బాల‌య్య అభిమానులు ఒక వైపు మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తునే ఉన్న…

నంద‌మూరి బాల‌కృష్ణ వార‌సుడు మోక్ష‌జ్ఞ వెండితెర అరంగేట్రం గురించి చాల రోజుల నుండి చ‌ర్చ జ‌రుగుతోనే ఉంది. బాల‌య్య అభిమానులు ఒక వైపు మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తునే ఉన్న అటు వైపు నుండి మాత్రం గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డం లేదు.

గ‌తంలో నంద‌మూరి మోక్ష‌జ్ఞ గురించే చాల గాసిప్స్ వినిపించాయి కానీ ఏది నిజం కాలేదు. బోయపాటి శ్రీను నుండి అనిల్ రావిపూడి వ‌ర‌కు చాల డైర‌క్ట‌ర్ పేర్లు వినిపించినా సినిమా వైపు అడుగులు ప‌డ‌లేదు. బాల‌య్య సినిమాలో ఎంట్రీ అని కూడా వార్త‌లు వినిపించాయి.

గ‌తంలో బాల‌కృష్ణ జ‌న్మ‌దిన వేడుక‌ల్లో క‌నిపించిన మోక్ష‌జ్ఞ లుక్ చుస్తే కొంచం బొద్దుగా క‌నిపించారు అది చూసి సినిమా ఇప్ప‌ట్లో లేద‌నుకున్నారు. పూర్తి ఫిట్ గా త‌యార‌వ‌డానికి స‌మయం ప‌డుతుంద‌ని ఆ త‌ర్వాత మోక్ష‌జ్ఞ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

తాజాగా ఇవాళ మోక్ష‌జ్ఞ పుట్టిన రోజు సంద‌ర్భంగా బాల‌య్య ఇంట్లో బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ సంద‌ర్భంగా త‌న‌యుడితో కేక్ క‌ట్ చేయించి.. కూమారుడికి కేక్ తినిపించిన ఫోటో ఇప్పుడు వైర‌ల్ అవుతుంది. అందులోని మోక్ష‌జ్ఞను చూసిన నంద‌మూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అందులో మోక్ష‌జ్ఞ పూర్తిగా మారిపోయిన‌ట్లు క‌న‌ప‌డుతోంది. పూర్తి ఫిట్ గా మారి హీరోకు కావాల్సినట్లుగా తయారైయ్యారని అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. అభిమానులు కొరుకున్న‌ట్లు ఇప్ప‌టికైనా నంద‌మూరి మోక్ష‌జ్ఞ నుండి గ్రీన్ సిగ్న‌ల్ వ‌స్తుందా అనేది తెలియాల్సి ఉంది.