మౌత్ టాక్ పని చేసింది. నాంది సినిమాను థియేటర్ల దగ్గర బ్రేక్ ఈవెన్ చేసి, బయ్యర్లకు కాస్త కమిషన్లు కూడా ఇస్తోంది.
మరోపక్క ఇప్పటి వరకు ఏవీ అమ్మకుండా, లేదా అమ్ముడు కాకుండా వుండడం అన్నది నిర్మాతలకు బాగా కలిసి వస్తోంది. ఇప్పటికే రీమేక్ రైట్స్ ను నిర్మాత దిల్ రాజు రెండు కోట్లకు కాస్త అటు ఇటుగా కొన్నారని వార్తలు వచ్చాయి.
ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ఆహా ఓటిటికి కొనుగోలు చేసారు. 2.50 కోట్లకు ఈ హక్కులను ఆహా తీసుకుంది. సినిమా దర్శకుడు విజయ్ కు ఇప్పటికే మంచి పేరు, ఆఫర్లు రెండూ వచ్చాయి.
నిర్మాతకు కూడా లాభాలు మిగిలాయి. ఇక అల్లరి నరేష్ కు కాస్త మంచి వైవిధ్యమైన పాత్రలు వస్తే, నాంది సినిమా అన్ని విధాలా అందరికీ మంచే చేసినట్లు అవుతుంది.