Advertisement

Advertisement


Home > Movies - Movie News

రేసీగా మడ్డీ టీజర్

రేసీగా మడ్డీ టీజర్

ఇండియన్ స్క్రీన్ మీద మడ్ రోడ్ రేస్ ను చూపించబోతున్న సినిమా మడ్డీ. అయిదు భాషల్లో తయారవుతున్న సినిమా ఇది. ఈ సినిమా టీజర్ ను డైరక్టర్ అనిల్ రావిపూడి ఆన్ లైన్ లోకి విడుదల చేసారు. 

ఈ చిత్రంతో డాక్టర్ ప్రగభల్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా యువన్, రిధాన్ కృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అడ్వంచర్ రేసింగ్ ఇష్టపడేవారికి నచ్చేలా వుంది టీజర్. 'మడ్డీ' టీజర్ రెసీ గా ఉంది. 

రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు, కె జీ రతీష్ సినిమాటోగ్రఫీ టీజర్ కు ప్లస్ అయ్యాయి. టీజర్ అయినా కాస్త లెంగ్తీగానే వుంది. రెండు బృందాలు బురద దారుల్లో పోటీ పడడం, ఆ పోటీలో చోటు చేసుకున్న రకరకాల సంఘటనలు ఎట్ ఎ గ్లాన్స్ టీజర్ లో చూపించారు. 

రియల్ స్టంట్స్ తో, ఎంతో రీసెర్చ్ తో వినూత్నంగా తెరకెక్కిన మడ్డీ టీజర్ లో చిత్ర బృందం పడిన కష్టం తెలుస్తోంది. సమ్మర్ లో విడుదలకు చిత్రం  సిద్ధమవుతోంది. 

అడ్వెంచరస్ ప్యాన్ ఇండియా మూవీ మడ్డీ టీజర్ ను ఇతర భాషల్లో అర్జున్ కపూర్, ఫాహద్ ఫాసిల్, జయం రవి మరియు శివ రాజకుమర్ రిలీజ్ చేశారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?