హీరోయిన్లకు చాలా భయలుంటాయి. ప్రేమలో పడినా, పెళ్లయినా, తమకున్న శారీరక సమస్యల్ని బయటపెట్టినా అవకాశాలు రావేమో అని టెన్షన్ పడుతుంటారు. ఇది నిజం కూడా. కాకపోతే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు హీరోయిన్లకు అలాంటి భయాలు అక్కర్లేదు.
అలియా, కియరా లాంటి హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకొని కెరీర్ కొనసాగిస్తున్నారు. సమంత లాంటి హీరోయిన్లు తమ శారీరక సమస్యల్ని కూడా బయటపెట్టారు. ఇప్పుడీ కోవలోకి మరో హీరోయిన్ వచ్చి చేరింది. ఆమె పేరు నందితా శ్వేత.
కొన్నాళ్లుగా నందిత శ్వేత కూడా ఓ శారీరక సమస్యతో బాధపడుతోంది. దాని పేరు ఫైబ్రోమయాల్జియా. ఇది వెన్నెముక, కండరాలకు సంబంధించిన సమస్య. సడెన్ గా నీరసం వచ్చేయడం, బ్రెయిన్ నొప్పిని గ్రహించలేకపోవడం లాంటివి ఈ రుగ్మత లక్షణాలు.
ఈ సమస్యతో బాధపడుతోంది నందిత శ్వేత. దీని వల్ల ఎక్కువగా వ్యాయామాలు చేయడం కుదరదు. కానీ హిడింబ సినిమాలో పోలీస్ పాత్ర కోసం బరువు తగ్గాలి. దీంతో ఓవైపు హెల్త్ సహకరించనప్పటికీ, ఎక్సర్ సైజులు చేసి బరువు తగ్గింది నందిత శ్వేత.
హిడింబ ప్రమోషన్స్ లో భాగంగా ఇలా తన ఆరోగ్య సమస్యను బయటపెట్టింది ఈ హీరోయిన్. ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్లు కష్టపడ్డానని చెబుతోంది. ఈ సినిమా సక్సెస్ అవ్వడం నందిత శ్వేత టాలీవుడ్ కెరీర్ కు చాలా అవసరం.