నాని సినిమా.. ట్రయిల్ షూట్

హీరో నాని కొత్త సినిమాకు ట్రయిల్ షూట్ జరిగింది. గమ్మత్తేమిటంటే ఇలా ట్రయిల్ షూట్ చేయించడం అన్నది హీరో నాని కి అలవాటు. దసరా సినిమా ముందు కూడా ఇలాగే చేసారు.  Advertisement కొద్దిగా…

హీరో నాని కొత్త సినిమాకు ట్రయిల్ షూట్ జరిగింది. గమ్మత్తేమిటంటే ఇలా ట్రయిల్ షూట్ చేయించడం అన్నది హీరో నాని కి అలవాటు. దసరా సినిమా ముందు కూడా ఇలాగే చేసారు. 

కొద్దిగా ఖర్చు చేయించి, కొత్త దర్శకుడు సీన్ ను హ్యాండిల్ చేయగలడా లేడా అని టెస్ట్ చేసారు. ఆ టెస్ట్ పాస్ అయ్యాక సినిమా చేతిలో పెట్టారు. అయితే ఇప్పుడు ఇలా ట్రయిల్ షూట్ చేయించిన సినిమాకు మాత్రం కొత్త దర్శకుడు కాదు.రెండు సినిమాలు అందించిన వివేక్ ఆత్రేయ.

డివివి దానయ్య నిర్మించే నాని సినిమాకు వివేక్ ఆత్రేయనే దర్శకుడు. అయితే ఇప్పుడు చేయబోయే సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా. అంత యాక్షన్ ను వివేక్ ఆత్రేయ హ్యాండిల్ చేయగలడా లేదా అన్నది చిన్న అనుమానం. అందుకే ఇటీవల రెండు రోజులు ఓ మాంచి యాక్షన్ సీన్ ను డమ్మీ ఆర్టిస్ట్ లతో చిత్రీకరించమని చెప్పాడట హీరో. ఆ మేరకు రెండు రోజుల చిత్రీకరణ పూర్తయిందని తెలుస్తోంది.

రెండు రోజుల సీన్ బాగానే వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా దసరాకు అనౌన్స్ చేస్తారు. అక్కడి నుంచి ఏకబిగిన సెట్ మీదకు వెళ్తుంది. ఈ సినిమా కోసం గ్యాంగ్ లీడర్ హీరోయిన్ ప్రియ ను రిపీట్ చేస్తున్నారు.