నాని సినిమాకు షాకింగ్ ప్రైస్

డిజిటల్ రేట్లు రాను రాను పెరిగిపోతున్నాయ్. నాని లేటెస్ట్ సినిమాకు వచ్చిన డిజిటల్ ప్రైస్ షాకింగ్ నే. నాని-మృణాళిని ఠాకూర్ కాంబినేషన్ లో శౌరవ్ డైరక్షన్ లో నిర్మాత సివి మోహన్ నిర్మిస్తున్న సినిమాకు…

డిజిటల్ రేట్లు రాను రాను పెరిగిపోతున్నాయ్. నాని లేటెస్ట్ సినిమాకు వచ్చిన డిజిటల్ ప్రైస్ షాకింగ్ నే. నాని-మృణాళిని ఠాకూర్ కాంబినేషన్ లో శౌరవ్ డైరక్షన్ లో నిర్మాత సివి మోహన్ నిర్మిస్తున్న సినిమాకు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కింద 35 కోట్లు వచ్చాయి. ఇదే షాక్ అనుకుంటే అది కూడా ఓన్లీ సౌత్ ఇండియాలో స్ట్రీమింగ్ కు మాత్రమే అన్నది మరో షాక్.

నాని ఇంతకు ముందు సినిమాకు డిజిటల్ రైట్స్ 19 కోట్లు మాత్రమే వచ్చింది. ఇప్పుడు ఆల్ మోస్ట్ డబుల్ అన్నమాట. హిందీ డబ్బింగ్ తో కలిపి నార్త్ ఇండియా డిజిటల్ స్ట్రిమింగ్ హక్కులు అమ్ముతారో? లేక విడివిడిగా అమ్ముతారో అన్నది ఇంకా డిసైడ్ కాలేదు. ఎలా అమ్మినా పాతిక కోట్లకు పైగా ఆ ఆదాయం వుంటుంది.

అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. అందుకే అడియో రైట్స్ కూడా కాస్త గట్టిగానే వస్తున్నాయి. టీ సిరీస్ సంస్థ ఏడు కోట్లకు ఆఫర్ ఇచ్చింది. అంటే నాన్ థియేటర్ మీద 70 కోట్లకు పైగా వస్తుందన్నమాట. దసరా సినిమా తరువాత నాని చేస్తున్న సినిమా ఇది. ఇది పక్కా లవ్ అండ్ ఫ్యామిలీ సబ్జెక్ట్. నిన్ను కోరి సినిమాకు ఎక్స్ టెన్షన్ అన్నట్లు వుంటుందని టాక్.