విష్వక్ సరసన ఇద్దరు

దాస్ కా ధమ్కీ తో మంచి ఓపెనింగ్ తెచ్చుకున్నాడు విష్వక్ సేన్. దాని తరువాత సినిమాను సితార సంస్థలో ఓకె చేసాడు. కొత్త దర్శకుడు పని చేస్తారు ఈ సినిమా కోసం ఇద్దరు హీరోయిన్లను…

దాస్ కా ధమ్కీ తో మంచి ఓపెనింగ్ తెచ్చుకున్నాడు విష్వక్ సేన్. దాని తరువాత సినిమాను సితార సంస్థలో ఓకె చేసాడు. కొత్త దర్శకుడు పని చేస్తారు ఈ సినిమా కోసం ఇద్దరు హీరోయిన్లను బ్లాక్ చే సారు. 

డిజె టిల్లు తో జనాలను ఆకట్టుకున్ని రాధిక…నేహాశెట్టి, సీతమ్మ వాకిట్లో సీత…అంజలి కలిసి విష్వక్ సేన్ సరసన నటించబోతున్నారు. మెయిన్ హీరోయిన్ నేహా నే. కానీ అంజలి చాలా అంటే చాలా మాంచి కీలకమైన పాత్ర. అందుకే అంజలి వెంటనే ఓకె అనేసింది.

ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు విష్వక్ సేన్. ఒకటి రామ్ తాళ్లూరి తో, రెండు సితార సంస్థతో. మూడొ సినిమా డిస్కషన్ లో వుంది. విష్వక్ సేన్ మార్కెట్ ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతోంది. సాలిడ్ గా 8 కోట్ల థియేటర్ మార్కెట్ కనిపిస్తోంది. 

మరో ఎనిమిది కోట్ల నాన్ థియేటర్ మార్కెట్ వుంది. అందువల్ల చాలా మంది నిర్మాతలు విష్వక్ కు సూటయ్యే మంచి సబ్జెక్ట్ ల కోసం వెదుకుతున్నారు.