Advertisement

Advertisement


Home > Movies - Movie News

నాని కూడా టాప్ లీగ్ లోకి?

నాని కూడా టాప్ లీగ్ లోకి?

ఒకప్పుడు టాప్ హీరో సినిమా అంటే ఖర్చు 50 నుంచి 70 కోట్లు. మిడ్ రేంజ్ హీరో అంటే ముఫై నుంచి యాభై కోట్లు. చిన్న హీరో అంటే పది నుంచి ఇరవై కోట్లు. ఇప్పుడు ఈ ఈక్వేషన్లు అన్నీ మారిపోయాయి. 

నాన్ థియేటర్ ఆదాయం పెరగడంతో ఆ మేరకు సినిమాల నిర్మాణ వ్యయం, వాటితో పాటు హీరోల పారితోషికాలు పెరిగిపోయాయి. కానీ టర్నోవర్ కనిపిస్తోంది తప్ప నిర్మాతకు వచ్చే లాభం మాత్రం అంతంతే వుంటోంది. వస్తున్న రెవెన్యూ అంతా, అంతకు అంతా సినిమా వ్యయం కోసం ఖర్చు చేసే విధంగా హీరోల ప్లానింగ్ లు వుంటున్నాయి.

వి సినిమా ప్లానింగ్ నాటికి నాని సినిమాకు నలభై కోట్ల ఖర్చు అంటే అమ్మో అనే పరిస్థితి. ఇప్పుడు దసరా సినిమా ఖర్చు అన్నీ కలిపి 70 కోట్ల పై మాటే. తొలి రోజు వసూళ్లు చూస్తుంటే అంతకు అంతా వస్తుందనే నమ్మకం. సినిమా రెండు తెలుగు రాష్ట్రాల హక్కులు 32 కోట్ల మారు బేరానికి కొన్న డిస్ట్రిబ్యూటర్ శిరీష్ అయితే ఫుల్ హ్యపీగా వున్నారు. విశాఖ ఏరియాకే 7 కోట్లు వస్తుందని ఆయన నమ్మకంగా చెబుతున్నారు. అంటే ఆ లెక్కన పెట్టిన దానికి ఆల్ మోస్ట్ డబుల్ అనుకోవాలి. ఇదే కరెక్ట్ అయితే, సినిమా తెలుగు రాష్ట్రాల్లో 60 వరకు వసూళ్లు సాగించాల్సి వుంటుంది.

అంటే ఇప్పుడు నాని ఇక మిడ్ రేంజ్ హీరో ఎంత మాత్రం కాదు. నాని మీద కూడా 70 కోట్లు ధైర్యంగా పెట్టేయచ్చు. నాని సినిమాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో ముఫై కోట్లు దాటి మార్కెట్ చేసుకోవచ్చు. కానీ అన్ని సినిమాలకు ఈ రేంజ్ బజ్ రాదు కదా అనే క్వశ్చను వుంటుంది. కానీ ఈ రేంజ్ రావాల్సిందే. ఎందుకంటే ఇకపై నాని సినిమాలు అన్నీ ఇదే రేంజ్ ఖర్చుతో కూడు కున్నవే.

అయితే నిర్మాణ వ్యయం లేదంటే రెమ్యూనిరేషన్ మొత్తం మీద 50 నుంచి 60 కోట్లకు చేరుకుంది బడ్జెట్. నాని రెమ్యూనిరేషన్ ఇప్పుడు 22 కోట్లు ప్లస్ లాభాల్లో వాటా అని వినిపిస్తోంది. వాటా సంగతి అలా వుంచితే 22 కోట్లు రెమ్యూనిరేషన్ అంటే సినిమా మొత్తం ఖర్చు 50 నుంచి 60 కోట్లకు చేరిపోతుంది. నాన్ థియేటర్ వస్తే ఓకె. లేదంటే థియేటర్ మీద భారం పడుతుంది. ఇది కూడా నార్మల్ కథ అయితే. అదే కనుక దసరా లాంటి కథే అయితే సినిమా ఖర్చు ఈసారి 80 కోట్లు దాటేస్తుంది. అంటే నాని కూడా టాప్ లీగ్ లో చేరినట్లే. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?