‘నాని’ కోసం ఆరున్నర కోట్ల సెట్

పీరియాడికల్ సబ్జెక్ట్ తో సినిమా తీయాలంటే ముందుగా కావాల్సింది సెట్ లే. అది బాహుబలి అయినా రంగస్థలం అయినా, రాధేశ్యామ్ అయినా సరే.   Advertisement ప్రభాస్ రాథేశ్యామ్ కోసం వింటేజ్ ఇటలీని రీ క్రియేట్…

పీరియాడికల్ సబ్జెక్ట్ తో సినిమా తీయాలంటే ముందుగా కావాల్సింది సెట్ లే. అది బాహుబలి అయినా రంగస్థలం అయినా, రాధేశ్యామ్ అయినా సరే.  

ప్రభాస్ రాథేశ్యామ్ కోసం వింటేజ్ ఇటలీని రీ క్రియేట్ చేస్తే, హీరో నాని సినిమా శ్యామ్ సింఘ రాయ్ కోసం ఒకప్పటి కలకత్తా నగరాన్ని చూపించబోతున్నారు. ఇందుకోసం ఆర్ట్ డైరక్టర్ అవినాష్ కోళ్ల పది ఎకరాల్లో ఓ భారీ సెట్ నే వేసారు.

సిటీ అవుట్ స్కర్ట్స్ లో పది ఎకరాల స్థలంలో ఆరున్నర కోట్ల వ్యయంతో ఓ భారీ ఓల్డ్ కలకత్తా సెట్ ను తయారు చేసారు. దాదాపు రెండు వారాల పాటు ఈ సెట్ లో షూటింగ్ వుంటుంది.  

శ్యామ్-సింగ రాయ్ సినిమాలో నాని డబుల్ ఫోజ్ లో కనిపిస్తాడు. సింగరాయ్ పాత్ర కలకత్తా బ్యాక్ డ్రాప్ లో వుంటుంది. అందుకే ఈ సెట్ ను రూపొందిస్తున్నారు.

వెంకట్ బోయినపల్లి నిర్మించే ఈ సినిమాకు రాహుల్ దర్శకుడు. సాయి పల్లవి, కీర్తి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీత దర్శకుడు.