సిక్కోలుకు వంశధార వరం?

ఏపీలో జలవనరులకు కొదవ లేదు. పాలకులు శ్రధ్ధ చూపిస్తే ఉప్పు సముద్రంపాలు అయ్యే జీవ జలాలను ఒడిసిపట్టవచ్చు, పచ్చని పొలాలతో రాష్ట్రాన్ని సుభిక్షమే చేయవచ్చు. ముఖ్యమంత్రి జగన్ ఇపుడు అదే పని మీద ఉన్నారు.…

ఏపీలో జలవనరులకు కొదవ లేదు. పాలకులు శ్రధ్ధ చూపిస్తే ఉప్పు సముద్రంపాలు అయ్యే జీవ జలాలను ఒడిసిపట్టవచ్చు, పచ్చని పొలాలతో రాష్ట్రాన్ని సుభిక్షమే చేయవచ్చు. ముఖ్యమంత్రి జగన్ ఇపుడు అదే పని మీద ఉన్నారు. మిగిలిన పాలకులతో పోలిస్తే ఆయనకు వ్యవసాయం మీద, జలవనరుల ప్రాజెక్టుల మీద శ్రధ్దాసక్తులు మెండు.

దాంతోనే ఏళ్ళూ పూళ్లూగా మూలన పడి ఉన్న శ్రీకాకుళం జిల్లా నేరడి బ్యారేజ్ నిర్మాణ‌ విషయంలో చొరవ చూపిస్తున్నారు. ఇక్కడ బ్యారేజ్ నిర్మాణం చేపడితే చాలు ఉప్పు సముద్రం పాలు అవుతున్న వంశధార నదీ జీవ జలాలను పెద్ద ఎత్తున వాడుకోవచ్చు.

అయితే దీనికి భూ వివాదం ఒడిషాతో ఉంది. నేరేడు బ్యారేజ్ నిర్మాణానికి పొరుగు రాష్ట్రం మోకాలడ్డుతోంది. దాంతో చర్చలకు జగన్ తెర తీశారు. నేరుగా ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ కు లేఖ జగన్ రాశారు. నేరడి బ్యారేజ్ నిర్మాణం వల్ల ఏపీకే కాదు ఒడిషాకు ఏ విధంగా లబ్ది కలుగుతుందో వివరించారు.

అధికారుల స్థాయి చర్చలకు కూడా ఆయన ఆహ్వానం పలికారు. ఈ బ్యారేజ్ నిర్మాణం వల్ల శ్రీకాకుళం జిల్లాతో పాటు ఒడిషాకు చెందిన గజపతి జిల్లా రైతాంగానికి కూడా పెద్ద ఎత్త్న మేలు జరుగుతుంది. 

ఏకంగా 80 టీఎంసీల నీటిని సముద్రంపాలు కాకుండా ఒడిసిపట్టవచ్చు. అత్యంత వెనకబడిన సిక్కోలుకు వ్యవసాయం వృద్ధి అయి అయి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుంది. ఈ అదనపు నీటితో జిల్లాలో పారిశ్రామిక వాతావరణం కూడా మెరుగు అవుతుంది.