ఇన్వెస్టిగేటివ్ క్రైం సిరీస్. హిట్ 3 లో నాని హీరో అని పక్కా అయిపోయింది. ఈ విషయాన్ని గ్రేట్ ఆంధ్ర ముందే వెల్లడించింది. హిట్ 2 సినిమా చివరిలో నాని పోలీస్ ఆఫీసర్ సర్కార్ గా కనిపించారు. ఆ మధ్య వి సినిమాలో చూసిన మాదిరిగానే కనిపించాడు. చూపు..మాట..నడక అంతా అదే స్టయిల్ అనిపించింది. నాని ఈ పాత్ర చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్న డిస్కషన్లు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.
ఎందుకంటే నాని హీరోగా ఎంట్రీ ఇచ్చేసరికి ఆ ప్లేస్ ఖాళీగా వుంది. రాజేంద్ర ప్రసాద్ అలాంటి మాంచి ఫ్యామిలీ ఫన్నీ రోల్స్ చేసేవారు. అప్పటికి ఆయన సీనియర్ అయిపోయారు. రాజేంద్ర ప్రసాద్ మాస్ కామెడీకి క్లాస్ టచ్ ఇచ్చి, ‘పక్కింటి కుర్రాడు’ అవార్డు ను నాని పట్టేసారు. అక్కడి నుంచి నానికి ఎదురు లేదు. కానీ మధ్యలో ఊరుకోకుండా పక్కదారులు ప్రయత్నించారు. ఫెయిల్యూర్ లు చవి చూసారు. భలే భలే మగాడివోయ్ సినిమాతో మళ్లీ లైన్ లోకి వచ్చారు. కానీ తన డిఫరెంట్ రోల్స్ అనే ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు.
కానీ అలాంటి ప్రయత్నాలు ఏవీ నానికి సహకరించడం లేదు. విలనీ టచ్ వున్న రోల్ చేయాలని వి సినిమా చేస్తే బ్యాక్ ఫైర్ అయింది. కృష్ణార్జున యుద్దం..గ్యాంగ్ లీడర్, టక్ జగదీష్ ఇలా ప్రతి ప్రయత్నం మిస్ పైర్ అవుతోంది. శ్యామ్ సింగరాయ్ ఒక్కటే ఊరట. అంటే సుందరానికి పెర్ ఫెక్ట్ ఛాయిస్ నే కానీ అదీ నడవలేదు.
ఇప్పుడు గతంలో నాని చేసిన టైపు పాత్రలు అన్నీ వేరే హీరోలు అందిపుచ్చుకుంటున్నారు. చాలా మంది అప్ కమింగ్ యంగ్ హీరోలు వచ్చేసారు. సిద్దు..విశ్వక్..నవీన్..ఇలా చాలా పెద్ద జాబితా వుంది. నాని మాత్రం తన గ్రవుండ్ వదిలేసి, వేరే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి దాని వెనుక ఆయన ఆలోచనలు ఏమిటో? హిట్ 3 విడుదల తరువాత మరింత క్లారిటీ రావచ్చు.