ఆ సినిమా ప్రస్తుతానికి లేదు

క్రేజీ కాంబినేషన్ కదా అని అంతా అనుకున్నారు. హీరో నాని- దర్శకుడు సుజిత్ కాంబినేషన్ సినిమా అంటే. కానీ ఇప్పుడు ఆ సినిమాను పక్కన పెట్టారు. దర్శకుడు సుజిత్ హీరో పవన్ కళ్యాణ్ తొ…

క్రేజీ కాంబినేషన్ కదా అని అంతా అనుకున్నారు. హీరో నాని- దర్శకుడు సుజిత్ కాంబినేషన్ సినిమా అంటే. కానీ ఇప్పుడు ఆ సినిమాను పక్కన పెట్టారు. దర్శకుడు సుజిత్ హీరో పవన్ కళ్యాణ్ తొ ఓజి సినిమా చేస్తున్నారు. నిర్మాత దానయ్య. కానీ పవన్ రాజకీయ వ్యవహారాల వల్ల కాస్త గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో నాని తో అదే దర్శకుడితో సినిమా చేయాలని దానయ్య అనుకున్నారు. నాని కి మంచి రెమ్యూనిరేషన్ ఆఫర్ చేసారు. అంతా ఓకె అనుకున్నారు.

తనకు వున్న రెండు కమిట్ మెంట్ లను కాస్త వెనక్కు నెట్టారు నాని. దసరా దర్శకుడితో ఒకటి, బలగం వేణుతో మరోటి. కానీ ఈలోగా సుజిత్ కాంబినేషన్ సినిమా లెక్కలు మారాయి. ఆ సినిమా బడ్జెట్ కు సినిమా మార్కెట్ కు మధ్య పొంతన కుదరడం లేదు. దానికి తోడు నిర్మాత దానయ్య సినిమా ఖర్చు విషయంలోనో, కాస్టింగ్ విషయంలోనూ కిందా మీదా కావడం చూసి, ఇక ఇబ్బంది వుండకూడదని హీరో నాని ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టారట.

మరి ఇప్పుడు దసరా దర్శకుడి ప్రాజెక్ట్ ముందుకు తీసుకువస్తారో? బలగం వేణు ప్రాజెక్ట్ ముందుకు తెస్తారో చూడాలి. కాస్ట్ ఎఫెక్ట్ కారణంగా ఓ నిర్మాత నాని ప్రాజెక్ట్ వదులుకోవడం ఇది రెండోసారి. గతంలో శ్యామ్ సింగ రాయ్ సినిమాను సితార సంస్థ అలాగే వదులుకుంది. నాని సినిమాలు మంచిగా వుంటున్నాయి కానీ కాస్ట్ ఫెయిల్యూర్ అవుతున్నాయనే విమర్శ వుంది. కానీ దానికి హీరో అంగీకరించరు.. అది కూడా వేరే సంగతి.