చూపే బంగారమాయెనే శ్రీవల్లీ.. పుష్ప సినిమా నుంచి వచ్చిన ఈ పాట ఎంత హిట్ అన్నది తెలిసిందే. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో డిఎస్పీ-చంద్రబోస్ అందించిన మాంచి మెలోడీ.
ఇప్పుడు పుష్ప 2 లో మళ్లీ అలాంటి మ్యాజిక్ రిపీట్ చేసే ప్రయత్నం చేసారు ఆ ఇద్దరూ, దర్శకుడు సుకుమార్ తో కలిసి. ఆ పాటను త్వరలో విడుదల చేస్తారని తెలుస్తోంది. పుష్ప సినిమా ప్రమోషన్లు షురూ అయ్యాయి. ఇప్పటికే తొలి పాటను విడుదల చేసారు. అది వైరల్ అయింది.
మలి పాటగా ఈ మెలోడిని విడుదల చేస్తారట. అందుకోసం లిరికల్ వీడియో వర్క్, ఇతరత్రా పనులు ప్రారంభించారు. మైత్రీ సంస్థ నిర్మించే పుష్ప 2 సినిమా ఆగస్టులో విడుదలవుతుంది. ఈ సినిమాకు దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ వుంది. రాబోతున్న పాన్ ఇండియా సినిమాల్లో ఇంత మాస్ క్రేజ్ వున్న సినిమా ఇదే. అటు హిందీ బెల్ట్ లో కూడా ఈ సినిమా మీద చాలా ఆసక్తి వుంది.
బన్నీ- రష్మిక- ఫాహిద్ ఫాజిల్ లాంటి క్రేజీ కాంబినేషన్ ను మళ్లీ తెరమీద చూడబోతున్నారు ప్రేక్షకులు.అందుకోసం చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలు అందుకునేలా సినిమాను రెడీ చేస్తున్నారు దర్శకుడు సుకుమార్.