రెమ్యూనిరేషన్ విషయంలో చకచకా మెట్లు ఎక్కుతున్న హీరోల్లో నాని ఒకరుగా నిలుస్తున్నారు. ఒకటి రెండేళ్ల క్రితం తొమ్మిది కోట్ల రేంజ్ లో వున్న నాని రెమ్యూనిరేషన్ ఇప్పుడు పాతిక కోట్లు దాటేసినట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.
నాని చాలా వెల్ ప్లాన్డ్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. సినిమా సినిమాకు ఆయన రెమ్యూనిరేషన్ పెరుగుతోంది. లేటెస్ట్ గా 25 కోట్లు దాటినట్లు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
నాని ప్రస్తుతం చేస్తున్న హాయ్ నాన్న సినిమాకు 22 కోట్లకు పైగా రెమ్యూనిరేషన్ అందుకున్నారని టాక్ వుంది. నాని ఓకె చేసి లైన్ లో వుంచిన సినిమాకు నిర్మాత చిట్టూరి శ్రీను 25 కోట్లు ఆఫర్ చేసారని వార్తలు వినిపిస్తున్నాయి. దానికన్నా ముందుగా వివేక్ ఆత్రేయ-డివివి దానయ్య సినిమా చేయాల్సి వుంది. బహుశా దానికి కూడా అదే రేంజ్ లో వుండొచ్చేమో?
వీలయినంత వరకు కొత్త దర్శకులు లేదా తనకు నచ్చిన దర్శకులతో మాత్రమే సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు నాని. చిట్టూరి శ్రీను నిర్మించే సినిమాకు తమిళ దర్శకుడు సిబి వర్క్ చేస్తారు. అది అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది.