తెలుగు సినిమాలు ఇప్పుడు తెలంగాణ ఎన్నికల తేదీ కోసం ఎదురచూస్తున్నాయి. డిసెంబర్ లో రావాలి అనుకున్న నాని హాయ్ నాన్న.. నితిన్ ఎక్స్ట్రా – ఆర్డినరీ మ్యాన్… వెంకీ సైందవ్ సినిమాల విడుదల తేదీలు సలార్ వల్ల డైలమా లో పడ్డాయి. సరే.. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో డేట్ వేసుకుందాం అంటే ఎన్నికల తేదీలు వస్తాయనే టాక్ మొదలైంది.
దాంతో ఈ సినిమాలు అన్నీ ఇపుడు వేచి చూసే నిర్ణయానికి వచ్చాయి. ఎన్నికల తేదీ లు వచ్చిన తరువాత వాటిని బట్టి విడుదల ప్లాన్ చేసుకోవాలి అని భావిస్తున్నాయి.
డిసెంబర్ లో రావడమా.. జనవరిలో ఏమన్నా అవకాశం ఉంటుందా… లేదూ అంటే ఫిబ్రవరి కి వెళ్లి పోవడమా.. ఇది ఇప్పుడు డిస్కస్ పాయింట్.
పాపం ఈ సినిమాలు అన్నీ దాదాపు వర్క్ పూర్తి అయినవే. కానీ సరైన డేట్ కోసం చూస్తూ వెయిటింగ్ లో ఉన్నాయి.. ఈ వెయిటింగ్ మరింత పెరిగేలా ఉంది కానీ తగ్గేలా లేదు.