నాని సినిమాలో శృతిహాసన్

హీరో నాని లేటెస్ట్ సినిమా ఒకటి రెడీ అవుతోంది. కొత్త దర్శకుడు..కొత్త బ్యానర్. ఈ సినిమాకు స్టార్ కాస్ట్ అంతా ఫిక్స్ అయిపోయింది.  Advertisement సినిమా నిర్మాణం కూడా జోరుగా సాగుతోంది. విడుదల డేట్…

హీరో నాని లేటెస్ట్ సినిమా ఒకటి రెడీ అవుతోంది. కొత్త దర్శకుడు..కొత్త బ్యానర్. ఈ సినిమాకు స్టార్ కాస్ట్ అంతా ఫిక్స్ అయిపోయింది. 

సినిమా నిర్మాణం కూడా జోరుగా సాగుతోంది. విడుదల డేట్ కూడా ప్రకటించేసారు. కానీ సినిమాలో ఓ కీలకపాత్ర వుంది. దానికి మాత్రం పేరు ఫిక్స్ కాలేదు.

ఇప్పుడు ఆ పాత్రకు శృతిహాసన్ ను తీసుకుంటున్నారు. శృతిహాసన్ తెలుగులో అప్పుడు అప్పుడు సినిమా చేస్తూనే వున్నారు. అయితే అవన్నీ హీరోయిన్లుగా. కానీ ఇప్పుడు అలా కాదు. ఓ స్పెషల్ రోల్ చేయబోతోంది. ఈ సినిమాలో ఇప్పటికే మృణాల్ ఠాకూర్ హీరోయిన్. ప్రస్తుతం ఈ సినిమా గోవాలో లెంగ్తీ షెడ్యూలు జరుగుతోంది.

నిన్ను కోరి సినిమాకు ఎక్సెటెన్షన్ టైపు కథ అని వినిపిస్తున్న ఈ సినిమాకు నిర్మాతలు సివిఎమ్..విజయేందర్ రెడ్డి. సంగీతం అబ్దుల్ వాహబ్.