పరుశురామ్ పై ఏకమవుతున్న నిర్మాతలు!

ఏ నిర్మాతకు నొప్పి వస్తే..ఆ నిర్మాతే బాధపడడం అన్నది టాలీవుడ్ లో కామన్. కానీ ఈ మధ్య డైరక్టర్లు అడ్వాన్స్ లు తీసేసుకోవడం, ఎప్పటికీ సినిమా చేయకపోవడం, మధ్యలో వేరే నిర్మాతలు ఎగరేసుకుపోవడం కామన్…

ఏ నిర్మాతకు నొప్పి వస్తే..ఆ నిర్మాతే బాధపడడం అన్నది టాలీవుడ్ లో కామన్. కానీ ఈ మధ్య డైరక్టర్లు అడ్వాన్స్ లు తీసేసుకోవడం, ఎప్పటికీ సినిమా చేయకపోవడం, మధ్యలో వేరే నిర్మాతలు ఎగరేసుకుపోవడం కామన్ అయిపోయింది.

అదేంటీ అని అడిగితే హీరోలు దొరలేదనో, దొరికారనో, వాళ్లను అడ్డం పెట్టుకుని తప్పించుకోవడం దర్శకులకు అలవాటైపోయింది. దర్శకుడిని ఎగరేసుకుని వెళ్లిన నిర్మాత కూడా దర్శకుడినే సపోర్ట్ చేస్తున్నారు. ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాత ఒంటరి అయిపోతున్నారు.

కానీ ఫర్ ఏ ఛేంజ్ తొలిసారి ఓ దర్శకుడు..నిర్మాతల మధ్య నెలకొన్న వివాదం విషయంలో నిర్మాతలు అంతా ఒక్కటవుతున్నారు. ఆ నిర్మాతలకు మద్దతుగా నిలవబోతున్నారు.

అసలు విషయం ఏమిటంటే దర్శకుడు పరుశురామ్ ఓ సినిమాను 14రీల్స్ కోసం చేయాలి. నాగేశ్వరరావు అనే టైటిల్ లో కథ రెడీ చేసుకున్నారు. నాగ్ చైతన్య హీరో. ఈ సినిమా పట్టాలు ఎక్కేలోగా సర్కారు వారి పాట అనే సినిమా అడ్డం పడింది. గీతగోవిందం అనే పెద్ద హిట్ తరువాత మరింత పెద్ద సినిమా చేయాలనే ఆలోచనతో దర్శకుడే స్వయంగా సర్కారు వారి పాట సెట్ చేసుకున్నారు. మహేష్ బాబు హీరో కావడంతో, ఆయనతో సన్నిహిత బంధాలు వుండడంతో 14 రీల్స్ జనాలు తగ్గిపోవాల్సి వచ్చింది.

సరే ఆ సినిమా అయిపోయింది. మళ్లీ పరుశురామ్ వెనక్కు వచ్చారు. చైతూతో మళ్లీ అదే కథ అనుకున్నారు. కానీ ఏమయిందో, ఆ కథ వద్దు అని దర్శకుడే చెప్పి, వేరే కథ తెస్తా అన్నారు. అక్కడ ఆగింది వ్యవహారం.

ఈ లోగా గీతా దగ్గర నుంచి ఆఫర్ వచ్చింది. వాళ్లు కూడా విజయ్ దేవరకొండతో సినిమా అనుకున్నారు. ఆ వార్తలు అలా వుండగానే సడెన్ గా దిల్ రాజు-విజయ్ దేవరకొండ సినిమా అనౌన్స్ చేసేసారు.

అటు గీతా..బన్నీ వాస్ షాక్…ఇటు 14 రీల్స్ షాక్. దిల్ రాజుతో ఎంతో సన్నిహితంగా, అన్ని రకాల బంధాలు కలిగి వున్నారు బన్నీ వాస్. అదిసరే, అసలు 14రీల్స్ సినిమా చేయకుండా దిల్ రాజు సినిమా చేయడం ఏమిటి? అన్నది పాయింట్. కథ కు హీరో ఓకె అన్నారు. నిర్మాత ఓకె అన్నారు. మరి ఇంక ఏమిటి సమస్య?

పైగా చిన్న చితక అడ్వాన్స్ కాదు. పెద్ద అడ్వాన్స్. దానికి వడ్డీలు..చక్ర వడ్డీలు..బారు వడ్డీలు..తిరగరాయడాలు అన్నీ కలిసి పెద్ద మొత్తమై కూర్చుంది. నిర్మాతలు అన్నీ కట్టుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో అలా చేయడం ఏమిటి? అన్నది.

దీంతో 14 రీల్స్ లీగల్ గా ఎంత చేయగలమో అంతా చేయాలని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఛాంబర్, కౌన్సిల్, డైరక్టర్స్ బాడీ ఇలా ఎక్కడ అవకాశం వుంటే అక్కడ ఫిర్యాదులు చేయడానికి రెడీ అవుతోంది. గిల్డ్ కు పెద్ద దిల్ రాజు. ఆయన ఇలా ఒక డైరక్టర్ ను పట్టుకు వెళ్లిపోవడం కరెక్ట్ కాదని గిల్డ్ సభ్యలు కూడా ఫీలవుతున్నారు. అందుకే హ్యాపెనింగ్ యంగ్ ప్రొడ్యూసర్లు అంతా ఈ విషయంలో 14 రీల్స్ కు మద్దతుగా నిలవాలని డిసైడ్ అయ్యారు. వివిధ బాడీల్లో 14 రీల్స్ కు మద్దతుగా తమ గొంతు వినిపించాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇది ఎక్కడికి వెళ్లి ఆగుతుందో మరి?