నాని-దిల్ రాజు-తమ్ముడు

నిర్మాత దిల్ రాజు తీయాలనుకుంటున్న సినిమాల్లో ఇది ఒకటి. దిల్ రాజు ఆస్థానం లో వెయిటింగ్ లో వున్న దర్శకుడు వేణు శ్రీరామ్. ఈయన తన ఎంసిఎ సినిమాకు సీక్వెల్ అన్నట్లుగా ఓ కథ…

నిర్మాత దిల్ రాజు తీయాలనుకుంటున్న సినిమాల్లో ఇది ఒకటి. దిల్ రాజు ఆస్థానం లో వెయిటింగ్ లో వున్న దర్శకుడు వేణు శ్రీరామ్. ఈయన తన ఎంసిఎ సినిమాకు సీక్వెల్ అన్నట్లుగా ఓ కథ రాసుకున్నారని తెలుస్తోంది. ఆ కథకు సినిమా టైటిల్ ‘తమ్ముడు’. ఈ కథను నాని తోనే మళ్లీ తీయాలని, అందుకు నానిని ఒప్పించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి ఫలించడం కోసం వెయిటింగ్.

ఈలోగా వేణు శ్రీరామ్ ను తమిళంలో పరిచయం చేయాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇంతకీ ఎంసిఎ సీక్వెల్ లాంటి కథకు తమ్ముడు అని టైటిల్ పెట్టడానికి కారణం, కథలో తమ్ముడిగా నాని, అక్కగా భూమిక వుంటారని తెలుస్తోంది. ఎంసిఎ లో వదినగా భూమిక కనిపించిన సంగతి తెలిసిందే. అదన్న మాట విషయం.

అయితే నాని ఓ చిక్కు వుంది కొత్త డైరక్టర్ అంటే చాలు, కథ బాగుంటే వెంటనే పచ్చ జెండా ఊపేస్తాడు. అలా కాకుండా కాస్త సీనియర్ లేదా కొన్ని సినిమాలు చేసిన దర్శకుడు అంటే చాలా ముందు వెనుక ఆడతాడు అని టాక్ వుంది. బహుళా అందుకే ఈ తమ్ముడు సినిమా డేట్ అవుతోందేమో? 

ఇదిలా వుంటే ఓ మెగా హీరో సినిమాకు ఈ ‘తమ్ముడు’ టైటిల్ మాంచి యాప్ట్ గా వుందని అడుతున్నారట. కానీ దిల్ రాజు మాత్రం వేణు శ్రీరామ్ సినిమా కోసం రిజిస్టర్ చేసి దగ్గర వుంచుకున్నారు.