మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా వల్ల మరో మంచి నటుడు తెలుగు తెరకు దొరికాడు. ఇప్పటికే పలు సినిమాలు చేసినా, సరైన క్యారెక్టర్ పడక ఎవ్వరికీ తెలియలేదు.
ఇప్పుడు ఈ సినిమాతో చంద్రమోహన్, తనికెళ్ల, నరేష్ ల తరువాత తండ్రి పాత్రలకు ఓ మంచి నటుడు దొరికాడు.అతగాడే గోపరాజు రమణ. ఆ సినిమా మిగిలిన నటుల అందరికన్నా బాగా నటించి శభాష్ అనిపించుకున్నాడు.
నిజానికి ఆ సినిమా గురించి కాస్తయినా మాట్లాడుకుంటున్నారంటే కారణం ఆ నటుడే.అయితే ఆ సినిమా సెలబ్రేషన్స్ లో, ట్వీట్లతో మాత్రం ఆ నటుడు ఎక్కడా కనిపించడం లేదు.
దాంతో జనాలు కొండలరావు (ఆ సినిమాలో పాత్ర పేరు) ఎక్కడ అని కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా వుంటే టాలీవుడ్ మాత్రం అతన్ని గుర్తించేసింది. ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ తన తరవాత సినిమాలో తండ్రి పాత్రకు అతన్ని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
అలాగే మరో ఇద్దరు దర్శకులు అతనికి తగిన పాత్రలు ఇవ్వడానికి ఫిక్స్ అయిపోయినట్లు బోగట్టా. మొత్తం మీద ఇన్నాళ్లకు గోపరాజు రమణ అనే థియేటర్ ఆర్టిస్ట్ కు కెరీర్ టర్నింగ్ ఇచ్చుకుంది.