మళ్లీ మొత్తానికి మరోసారి అభాసు అయ్యాడు బండ్ల గణేష్. కాంగ్రెస్ పార్టీలో చేరి, బ్లేడ్ సవాళ్లు విసిరి, ఆ తరువాత 'ఎన్నో అంటుంటాం. అన్నీ చేస్తామా? ఏమిటి?' అంటూ మాట మార్చి వెనకడుగు వేసాడు.
ఆ తరువాత పదే పదే తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవని ప్రకటిస్తూ వచ్చాడు. అలాంటిది నిన్నటికి నిన్న తనే స్వయంగా భాజపాలో చేరుతున్నా అంటూ మీడియాకు ఫీలర్లు వదిలాడు.
తిరిగి తెల్లవారే సరికి మళ్లీ పాత పాట మొదలుపెట్టాడు. తనకు రాజకీయాలు, పార్టీలతో సంబంధం లేదంటూ. అదేంటా? అని విచారిస్తే, ఇంటి సభ్యులు ఎవ్వరూ అంగీకరించడం లేదట. 'మనకి రాజకీయాలు ఎందుకు?వ్యాపారాలు చేసుకోక, కావాలంటే సినిమాలు చేసుకోక' అంటూ వత్తిడి చేస్తున్నారట.
హితులు, సన్నిహితులు కూడా అదే చెప్పడంతో మళ్లీ మరోసారి మాట మార్చకతప్పలేదు బండ్లకు. అంతేనా? బండ్లకు బోలెడు తలకాయనొప్పులు వున్నాయి.
ఇప్పుడు పొలిటికల్ సిట్యువేషన్ సీరియస్ గా వున్న టైమ్ లో టీఆర్ఎస్ కు ఎదురుగా వెళ్తే తేడా వస్తుందని భయపడ్డాడో? బండ్ల ప్రతిసారీ ఇలాగే అభాసు అవుతున్నాడు ఆ మధ్య పవన్ తో సినిమా అంటూ హల్ చల్ చేసాడు. తరువాత ఆ వైనం చప్పబడింది. ఇప్పుడు ఇదీ అలాగే అయ్యింది.