నారాయ‌ణ దాస్ నారంగ్ మృతి

ప్ర‌ముఖ నిర్మాత‌, చ‌ల‌నచిత్ర వాణిజ్య‌మండ‌లి అధ్య‌క్షుడు నారాయ‌ణ దాస్ నారంగ్ (76) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో వున్న ఆయ‌న స్టార్ ఆసుప్ర‌తిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయ‌న అక్కడ చికిత్స పొందుతూ మంగ‌ళ‌వారం ఉద‌యం…

ప్ర‌ముఖ నిర్మాత‌, చ‌ల‌నచిత్ర వాణిజ్య‌మండ‌లి అధ్య‌క్షుడు నారాయ‌ణ దాస్ నారంగ్ (76) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో వున్న ఆయ‌న స్టార్ ఆసుప్ర‌తిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయ‌న అక్కడ చికిత్స పొందుతూ మంగ‌ళ‌వారం ఉద‌యం 9.04 నిముషాల‌కు తుదిశ్వాస విడిచారు. ఆయ‌న‌కు ఇద్ద‌రు కుమారులు, ఒక కుమార్తె వున్నారు. ఆయ‌న కుమారులు సునీల్ నారంగ్‌, భ‌ర‌త్ నారంగ్ కూడా నిర్మాత‌లే. 

నారాయ‌ణ దాస్ నారంగ్ 1946 జులై 27న జ‌న్మించారు. దేశ విభజన సమయంలో పాకిస్థాన్ నుంచి ఇండియాకు వచ్చేసి, ముంబాయి, ఆ తరువాత హైదరాబాద్ లో వ్యాపారాలు చేపట్టారు. అలా అలా సినిమా ఫైనాన్స్ రంగంలోకి దిగారు. ఆ తరువాత ఎగ్జిబిటర్ గా మారారు. ఆయ‌న డిస్ట్రిబూట‌ర్‌గా ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను విడుద‌ల చేశారు. 

నిర్మాత‌గా మంచిపేరు సంపాదించుకున్నారు. అక్కడితో ఆగిపోకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగి అనేక ప్రాజెక్టులు చేపట్టారు. ఆయన కుమారుడు సునీల్ కూడా తండ్రి అడుగుజాడల్లోనే సినిమా వ్యాపారాన్ని విసర్తించారు. 

ఎ ఎమ్ బి సినిమాస్ పేరిట టాప్ క్లాస్ థియేటర్లను నిర్మించారు. త్వరలో బెంగళూరులో కూడా ఓపెన్ కాబోతోంది. అలాగే నగరంలో పలు టాప్ క్లాస్ థియేటర్లు  నిర్మాణంలో వున్నాయి. 

ఏషియ‌ర్ గ్రూప్ అధినేత గ్లోబ‌ల్ సినిమా స్థాప‌కుడు, ఫైనాన్సియ‌ర్‌కూడా ఆయిన ఆయ‌న చ‌ల‌న‌చిత్రరంగంలో అజాత‌శ‌త్రువుగా పేరుగాంచారు. తెలంగాణ‌లో పంపిణీదారునిగా ఆయ‌న మంచి పేరు ప్ర‌ఖ్యాతులు పొందారు. ఆయ‌న మృతి ప‌ట్ల తెలుగు చ‌ల‌న‌చిత్ర వాణిజ్య‌మండ‌లి, తెలంగాణ వాణిజ్య‌మండ‌లి త‌మ ప్ర‌గాఢ‌సానుభూతి తెలియ‌జేసింది.