బిగ్ బాస్ అనేది ఓ బ్రోతల్ హవుస్ అన్న సిపిఐ నాయకుడు నారాయణ ను చెప్పుతో కొట్టాలి అని బిగ్ బాస్ కంటెస్టెంట్ తమన్నా అన్నారు. ఓ ఛానెల్ లో బిగ్ బాస్ కార్యక్రమంపై జరిగిన హాట్ హాట్ చర్చలో ఆమె ఈ కామెంట్ చేసారు.
‘ ఈ డిస్కషన్ కు నారాయణను కూడా పిలవాల్సిందని, బ్రోతల్ హవుస్ అన్నందుకు చెప్పుతో కొట్టివుండేదాన్నని’ ఆమె అన్నారు. దానికి చర్చలో పాల్గొన్న మిగిలిన వారు అభ్యంతరం తెలిపారు.
అయితే తమన్నా కామెంట్లు తప్పు అయితే కావచ్చు అని, అలా అని బిగ్ బాస్ హవుస్ ను బ్రోతల్ హవుస్ అని అనడం కూడా తప్పు అని న్యూస్ మోడరేటర్ అనడం విశేషం. అక్కడ ఎటువంటి బ్రోతల్ పనులు జరగడం లేదన్నారు.
బిగ్ బాస్ కార్యక్రమాన్ని బలవంతంగా ప్రజలపై రుద్దుతున్నారని చర్చలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. ఇష్టంలేకపోతే చూడడం మానేయచ్చు అని తమన్నా అనగా, ఇష్టం లేకపోయినా బలవంతంగా చూసేలా రుద్దుతున్నారని మిగిలిన వారు అన్నారు.
బిగ్ బాస్ కార్యక్రమం కొత్తగా హాట్ స్టార్ లో 24 గంటల ప్రసారం అనే కొత్త కాన్సెప్ట్ తో ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే.