Advertisement

Advertisement


Home > Movies - Movie News

'మళ్లీ పెళ్లి' చేసుకుంటున్న నరేష్-పవిత్ర

'మళ్లీ పెళ్లి' చేసుకుంటున్న నరేష్-పవిత్ర

సీనియర్ నటుడు నరేష్, పవిత్ర పెళ్లి చేసుకున్నట్టు ఇప్పటికే ఓ వీడియో బయటకొచ్చింది. వీళ్లిద్దరూ మళ్లీ పెళ్లి చేసుకోవడం ఏంటనే సందేహం అక్కర్లేదు. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా పేరు 'మళ్లీ పెళ్లి'.

నిజజీవితంలో నరేష్-పవిత్ర అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి లీడ్ పెయిర్ గా ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకు 'మళ్లీ పెళ్లి' అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామంటూ ఆమధ్య ఓ వీడియో రిలీజ్ చేశాడు నరేష్. అందులో పవిత్ర-నరేష్ తన్మయత్వంలో ముద్దులు కూడా పెడుతున్నారు. ఆ తర్వాత తామిద్దరం పెళ్లి చేసుకున్నట్టు నరేష్-పవిత్ర ఈమధ్య ఓ  పెళ్లి వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఈ రెండు వీడియోలు ఈ సినిమా లోనివే.

ఈ సినిమాను స్వయంగా నరేష్ నిర్మిస్తున్నాడు. తన తల్లి విజయనిర్మల స్థాపించిన విజయకృష్ణ మూవీస్ బ్యానర్ ను పునరుద్ధరిస్తూ.. ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు నరేష్.

జయసుధ, శరత్ బాబు, అనన్య నాగళ్ల, వనిత విజయ్ కుమార్ లాంటి నటీనటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు.

'మళ్లీ పెళ్లి' అంటూ రిలీజ్ చేసిన వీడియో బాగుంది. ఇంటిముందు పవిత్ర లోకేష్ ముగ్గుపెడుతుంటే.. నరేష్ వెళ్లి ఆమె కళ్లలోకి కళ్లుపెట్టి చిలిపిగా చూసే సన్నివేశాన్ని విడుదల చేశారు. ఇండస్ట్రీకొచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నరేష్ చేస్తున్న గోల్డెన్ జూబ్లీ సినిమా ఇది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?