సినీనటుడు నరేశ్, ఆయన మూడో భార్య రమ్య రఘుపతి మధ్య విబేధాలు ఉన్న సంగతి తెలిసిందే! కొంతకాలంగా రమ్యకు దూరంగా ఉంటున్న నరేశ్ నటి పవిత్రతో సన్నిహితంగా ఉంటున్నాడు. దీంతో రమ్య.. భార్యను నేనుండగా వేరొకరితో ఎందుకు తిరుగుతున్నావంటూ రచ్చచేసింది.
ఈ క్రమంలో ఇద్దరూ ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకున్నారు. తాజాగా రమ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నరేశ్ ఎలాంటివాడో చెప్పుకొచ్చింది.
'నరేశ్.. నాకు డ్రైవర్‌తో లింకు పెట్టాడు. ఎవరెవరితోనూ లింకులు కలిపాడు. అంత క్రియేటివిటీ ఆయనకే దక్కుతుంది. నా మీద అతడు నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్నకొద్దీ బాబు చాలా డిస్టర్బ్ అవుతున్నాడు. నిద్ర లేని రాత్రుళ్లు గడుపుతున్నాడు. ఎంతో హర్ట్ అవుతున్నాడు. అతడి గురించి ఒక్కసారి కూడా ఆలోచించడం లేదు. అంతేకాదు, నరేశ్ పోర్న్ వీడియోలు చూస్తాడు. నాన్న డర్టీ వీడియోలు చూస్తున్నాడని నా కొడుకు రణ్‌వీర్ వచ్చి చెప్పడంతో ఆ విషయం నాకు తెలిసింది. తండ్రిగా ఎంత బాధ్యతగా ఉండాలి? కానీ అతడు ఎంతో చండాలంగా ప్రవర్తిస్తున్నాడు' ఆగ్రహం వ్యక్తం చేసింది రమ్య.
కాగా నరేశ్ ప్రస్తుతం నటి పవిత్ర లోకేశ్‌తో ప్రేమలో ఉన్నాడు. త్వరలోనే వీరి పెళ్లి కూడా జరగనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇందులో నరేశ్, పవిత్ర లిప్‌లాక్‌తో తమ ప్రేమను ప్రకటించారు.