టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి, ఈ న్యూస్ ను ముందుగా ‘గ్రేట్ ఆంధ్ర’ ఎక్స్ క్లూజివ్ గా బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. శర్వా పెళ్లి పూర్తిగా అరేంజ్డ్ అని తెలిసింది. ఇంట్లో వాళ్లు, సన్నిహితులు కలిసి కుదిర్చిన సంబంధం ఇది.
బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలు అంటే కుమార్తె కూతురు నే పెళ్లి కూతురు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన కొడుకు సుధీర్ కు సినిమా ఇండస్ట్రీ జనాలతో మంచి సంబంధాలు వున్నాయి.
ఆయన కూడా 2019 ఎన్నికల్లో పోటీ చేసారు. గోపాలకృష్ణా రెడ్డి కుమారుడు సుధీర్ సోదరి కుమార్తెతో శర్వానంద్ ఎంగేజ్ మెంట్ ఈ నెల 26న జరుగుతుంది. పూర్తిగా ప్రయివేటు వ్యవహారంగా, అతి కొద్ది మందితో నిర్వహిస్తారు. త్వరలో డెస్టినేషన్ మ్యారేజ్ వుంటుంది. అది కూడా పూర్తిగా అతి కొద్ది మంది సన్నిహితులతో వుంటుంది.
తన ఎంగేజ్ మెంట్, పెళ్లి వేడుకలను అతి కొద్ది మందితో నిర్వహించి, తాను పూర్తిగా దాన్ని ఎంజాయ్ చేయాలని శర్వా అనుకుంటున్నారు. మరీ ఎక్కువ హడావుడి చేస్తే దాన్ని ఎంజాయ్ చేయలేనని శర్వా భావనగా తెలుస్తోంది. పెళ్లి సమ్మర్ లో వుంటుంది.