సినీ నటీనటులు నరేశ్- పవిత్ర పెళ్లిపై ఆయన భార్య రమ్య రఘుపతి బాంబు పేల్చారు. ఇటీవల పవిత్రను పెళ్లి చేసుకోనున్నట్టు నరేశ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లెప్పుడనేది మాత్రం ఆయన ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో నరేశ్ మూడో భార్య రమ్య తాజాగా వారి పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు ఇంకా నరేశ్ విడాకులు ఇవ్వలేదని స్పష్టం చేశారామె.
విడాకుల కేసు ఇంకా కోర్టులో నడుస్తున్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. ఇటీవల వాళ్లిద్దరూ విడుదల చేసిన వీడియో తనను ఎంతో బాధించిందన్నారు. సినిమా ప్రమోషన్ కోసం ఏమైనా చేశారా? అనే అనుమానం వచ్చినట్టు ఆమె పేర్కొన్నారు. నాన్నకు విడాకులు ఇవ్వొద్దని తమ కుమారుడు తన నుంచి మాట తీసుకున్నట్టు రమ్య తెలిపారు. నరేశ్‌తో కలిసే వుంటానని 11 ఏళ్ల కుమారుడికి మాట ఇచ్చినట్టు ఆమె వెల్లడించారు.
నరేశ్‌తో కలిసి వుండడానికే ప్రయత్నిస్తా అన్నారామె. నరేశ్‌కు విడాకులు ఇవ్వడానికి తాను సిద్ధంగా లేనని, వారి పెళ్లి జరగనివ్వనని ఆమె తేల్చి చెప్పారు. రమ్య హెచ్చరికలు సోషల్ మీడియాలో సంచలనం రేకెత్తిస్తున్నాయి. అతి త్వరలో వివాహ బంధంతో నరేశ్, పవిత్ర ఒక్కటవుతారని, ఇతరత్రా సమస్యలేవీ ఎదురు కావని భావిస్తున్న తరుణంలో రమ్య రఘుపతి వార్నింగ్ కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి.
రమ్య హెచ్చరికల వెనుక కారణం ఏమైనా వుందా? ఆర్థిక వ్యవహారాలు ముడిపడి ఉన్నాయా? తదితర అంశాలు తెరపైకి వస్తున్నాయి. పెళ్లికి అడ్డంకులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం నరేశ్‌పై ఉందని అందరూ చెప్పే మాట. మరి ఆయన ఏం చేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకుంది.