Advertisement

Advertisement


Home > Movies - Movie News

సోష‌ల్ మీడియాను ఊపేస్తున్న బికినీ స్టార్‌

సోష‌ల్ మీడియాను ఊపేస్తున్న బికినీ స్టార్‌

అత‌నో క్రికెట్ స్టార్‌. అత‌ను బ్యాటు ప‌ట్టాడంటే బాల్ బౌండ‌రీ లైన్ దాటాల్సిందే. క‌ళ్లు చెదిరే షాట్ల‌తో క్రికెట్ అభిమానుల్ని అల‌రించే ఆ అద్భుత క్రీడాకారుడే హార్దిక్ పాండ్యా. హార్దిక్ క్రీజ్‌లో ఉన్నాడంటే ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు వెన్నులో వ‌ణుకే. భార‌త జ‌ట్టు క‌ష్ట స‌మ‌యాల్లో ఉన్న‌ప్పుడు, త‌న బ్యాటింగ్ మాయాజాలంతో గ‌ట్టెక్కించిన ఘ‌న‌త హార్దిక్‌కు ద‌క్కుతుంది.

హార్దిక్ క్రికెట్ మాత్ర‌మే కాదు...ప్రేమాట ఆడ‌డంలో కూడా దిట్టే. సినీ న‌టి , బికినీ స్టార్ న‌టాషాతో ఆయ‌న ప్రేమాయ‌ణం సాగిస్తున్న విష‌యం తెలిసిందే. న‌టాషాతో హార్దిక్ నిశ్చితార్థం కూడా జ‌రిగింది. లాక్‌డౌన్ వేళ‌లో బికినీ స్టార్ న‌టాషా సోష‌ల్ మీడియాను ఓ ఊపేస్తోంది.

త‌న అర్ధ‌న‌గ్న చిత్రాన్ని సోష‌ల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ నెటిజ‌న్ల‌ను క‌ళ్లార్ప‌కుండా చేస్తోంది. దీన్ని బ‌ట్టి ఆ ఫొటో ఎంత‌గా వైర‌ల్ అవుతోందో అర్థం చేసుకోవ‌చ్చు. బీచ్‌లో న‌ల్ల రంగు బికినీలో ఫోజులిస్తూ కెమెరా ముందు వ‌య్యారాలు ఒల‌క‌బోస్తూ దిగిన ఆ ఫొటో కుర్ర‌కారును మ‌త్తెక్కిస్తోంది.

త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫొటో పోస్టు చేయ‌డంతో దానికి  ‘విటమిన్ సీ’ (విటమిన్ సముద్రం)అంటూ క్యాప్ష‌న్ పెట్టారు. సెర్బియా మోడ‌ల్‌, సినీ న‌టి అయిన న‌టాషా బిగ్‌బాస్‌-8తో తెరంగేట్రం చేసింది. ఆ త‌ర్వాత కొన్ని చిత్రాల్లో న‌టించి ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఏది ఏమైతేనేం కాబోయే భ‌ర్త క్రికెట్ స్టేడియంలో బ్యాట్‌తో ఊపేస్తే...ఈమె త‌న అంద‌చందాల‌తో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ సృష్టిస్తోంది. 

లాక్‌డౌన్ కట్టుబాట్లను దేశమంతా పాటించాలి

బెజవాడలో కనీ వినీ ఎరుగని దృశ్యం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?