Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఎన్టీఆర్ ఫ్యాన్స్ వ్య‌వ‌హారంపై జాతీయ స్థాయి ర‌చ్చ‌!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ వ్య‌వ‌హారంపై జాతీయ స్థాయి ర‌చ్చ‌!

మీరా చోప్రా.. దాదాపుగా తెలుగువారు మ‌రిచిపోయిన హీరోయిన్. ఒక‌టీ అర పెద్ద సినిమాల్లోనే న‌టించినా, ఈమె తెలుగునాట స‌క్సెస్ కాలేక‌పోయింది, తెర‌మ‌రుగు అయ్యింది. అయితే చేసిన సినిమాల‌తో ల‌భించిన గుర్తింపుతో ఆమెకు సోష‌ల్ మీడియాలో కొంత ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఆ ఫాలోయ‌ర్ల‌లో ఎందుకు ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారో కానీ, వాళ్లు చేసిన ర‌చ్చ ఇప్పుడు ఎన్టీఆర్ కే త‌లవంపుగా మారింది!

అందునా ఆడ‌బిడ్డ‌లు, కాలిమెట్టెలు అంటూ త‌ర‌చూ మాట్లాడే కుటుంబం తార‌క్ ది. ముందు ముందు ఇత‌డికీ పొలిటిక‌ల్ యాంబిష‌న్స్ లేక‌పోనూ లేదు. ఇలాంటి క్ర‌మంలో.. దారిపోయే వ్య‌వ‌హారాన్ని తెచ్చి ఎన్టీఆర్ నెత్తిన పెడుతున్నారు ఆయ‌న అభిమానులు. మీరా చోప్రాను ఎన్టీఆర్ ఫ్యాన్స్ బెదిరించిన తీరుపై జాతీయ మ‌హిళా క‌మిష‌న్ కూడా స్పందించింది. ఆమెకు పూర్తి స‌హ‌కారం అందిస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించింది.

తార‌క్ ఫ్యాన్స్ ఆమె విష‌యంలో చాలా ఓవ‌రాక్ష‌న్ చేసిన‌ట్టుగా ఉన్నారు. చంపుతాం, రేప్ చేస్తామంటూ వాళ్లు హెచ్చ‌రించార‌ట‌! కేవ‌లం ఎన్టీఆర్ త‌న‌కు తెలియ‌దు, తను ఆయ‌న ఫ్యాన్ కాదు అని ఆమె చెప్పిందంతే! ఈ మాత్రం దానికే ఇష్టానుసారం హెచ్చ‌రించేంత పోటుగాళ్లు అయిన‌ట్టుగా ఉన్నారు తార‌క్ ఫ్యాన్స్. వాళ్లు చేసిన ప‌నికి ఇప్పుడు ఎన్టీఆర్ పేరు నేష‌న‌ల్ మీడియా వ‌ర‌కూ ఎక్కింది. అది కూడా ఇలాంటి ర‌చ్చ‌తో! 

ఇది వ‌ర‌కూ చాలా మంది హీరోయిన్ల‌కు ఇలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి. ఈ మ‌ధ్య‌నే త‌మిళ‌నాట ఇలాంటి ర‌చ్చ జ‌రిగింది. సినిమా పోస్ట‌ర్ లో త‌న స్టిల్ గురించి ఒక స‌ర‌దా కామెంట్ చేసిన పాపానికి ఆ హీరోయిన్ ను తీవ్ర‌మాట‌ల‌తో హింసించారు ఒక స్టార్ హీరో అభిమానులు. ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల వంతు. 

మూడు చానల్స్ రెండు పేపర్లతో రాజకీయం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?