ఏ విషయంపైనైనా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడ్డం నవదీప్ స్టయిల్. మరీ ముఖ్యంగా తన వ్యక్తిగత విషయాలపై కూడా అంతే సూటిగా స్పందిస్తుంటాడు ఈ నటుడు. తాజాగా 2 కీలకమైన అంశాలపై నవదీప్ ఇచ్చిన సమాధానాలు వైరల్ గా మారాయి.
“బెంగళూరు రేవ్ పార్టీ మేటర్ లో నా పేరు బయటకు రాలేదు. దీనిపై చాలామంది డిసప్పాయింట్ అయ్యారనేది నా ఫీలింగ్. ఏంటన్నా నీ పేరు రాలేదంటూ కొంతమంది నన్ను ఇనస్టాగ్రామ్ లో కూడా అడిగారు. మంచే జరిగింది కదా. ఈ ఒక్కసారికి వదిలేయండి.”
ఇలా బెంగళూరు రేవ్ పార్టీపై తనదైన శైలిలో స్పందించాడు నవదీప్. రేవ్ పార్టీ అంటే రేయి- పగలు జరుపుకునే పార్టీ అంటూ చెప్పుకొచ్చిన నవదీప్, భారతదేశంలో మాత్రం తను ఎప్పుడూ రేవ్ పార్టీకి వెళ్లలేదని స్పష్టం చేశాడు.
ఇక పెళ్లిపై కూడా స్పందించాడు. పెళ్లి చేసుకుంటానో లేదో తెలియదన్నాడు. తనను తనలా ఉండనిచ్చే అమ్మాయి కోసం చూస్తున్నానని, అదే టైమ్ లో తన జీవితంలోకి వచ్చే అమ్మాయి కూడా వ్యక్తిత్వం విషయంలో నిక్కచ్చిగా ఉండాలని కోరుకుంటున్నాడు. లవ్ మౌళి సినిమా ప్రమోషన్స్ ను మళ్లీ స్టార్ట్ చేశాడు ఈ హీరో.