రిక్షావోడు చెప్పాడని హీరో అయ్యాడు

నటుడు నవదీప్ హీరోగా మారడానికి స్ఫూర్తి ఎవరో తెలుసా? ఓ రిక్షావోడు. అవును.. ఓ రిక్షావోడు చెప్పడం వల్ల తను హీరోగా మారానంటున్నాడు నవదీప్. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించాడు. Advertisement ఇంటర్మీడియట్…

నటుడు నవదీప్ హీరోగా మారడానికి స్ఫూర్తి ఎవరో తెలుసా? ఓ రిక్షావోడు. అవును.. ఓ రిక్షావోడు చెప్పడం వల్ల తను హీరోగా మారానంటున్నాడు నవదీప్. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించాడు.

ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో బెజ‌వాడలో ఓ సినిమా చూసి ఇంటికెళ్లడం కోసం రిక్షా ఎక్కాడు నవదీప్. రిక్షా ఎక్కిన నవదీప్ ను రిక్షావోడు ఎగాదిగా చూసి, నువ్వు హీరో అయితే బాగుంటుందని చెప్పాడట.

తనకు మనసులో  మొదటిసారిగా హీరో అవ్వాలనే ఆలోచన వచ్చింది ఆ సంఘటనతోనే అంటున్నాడు నవదీప్. ఇంటర్మీడియట్ పూర్తయిన వెంటనే తెలిసిన బంధువుల సహాయంతో తేజ దర్శకత్వంలో సినిమా ఛాన్స్ అందుకున్నాడు నవదీప్. 

అలా 17 ఏళ్లుకే హీరో అయ్యాడు. అయితే కెరీర్ లో తను చాలా తప్పులు చేశానని, మొహమాటం కొద్దీ చాలా సినిమాలు చేశానని అంటున్నాడు. ఫ్లాపులు రావడానికి తను తీసుకున్న నిర్ణయాలే కారణం అంటున్నాడు. 

ఇక తన వ్యక్తిగత విషయాలు గురించి మాట్లాడుతూ.. ముద్దుపెట్టడం ఎలా అనే అంశంపై ఓ అమ్మాయి దగ్గర 24 గంటల పాటు ట్రైనింగ్ తీసుకున్న విషయాన్ని బయటపెట్టాడు. 

ఆ అమ్మాయి పేరు V అనే అక్షరంతో మొదలవుతుందని కూడా చెప్పాడు. తను మిస్టర్ పెర్ ఫెక్ట్ కాదని ఒప్పుకున్న నవదీప్, లాక్ డౌన్ వచ్చి తన మైండ్ సెట్ మార్చేసిందని, ఇకపై కొత్త నవదీప్ ను చూస్తారని అంటున్నాడు.

కంగ‌నాపై ముంబైలో ఒక కేసు