బాలీవుడ్‌ న‌టుడిపై రెండో భార్య తీవ్ర ఆరోప‌ణ‌లు

బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్ధిఖీ రెండో భార్య ఆలియా కూడా విడాకుల బాట ప‌ట్ట‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ సంద‌ర్భంగా న‌వాజుద్దీన్ వ్య‌వ‌హార శైలి గురించి చ‌ర్చ జ‌రుగుతోంది. దీన్ని  రెండో భార్య…

బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్ధిఖీ రెండో భార్య ఆలియా కూడా విడాకుల బాట ప‌ట్ట‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ సంద‌ర్భంగా న‌వాజుద్దీన్ వ్య‌వ‌హార శైలి గురించి చ‌ర్చ జ‌రుగుతోంది. దీన్ని  రెండో భార్య ఆలియా తెర‌పైకి తెచ్చారు. త‌న భ‌ర్త న‌వాజుద్దీన్ సిద్ధిఖీ మొద‌టి భార్య‌ను శారీర‌కంగా, మాన‌సికంగా హింసించార‌ని ఆరోపించారు. అందువ‌ల్లే ఆమె న‌వాజుద్దీన్ నుంచి విడాకులు తీసుకున్న‌ట్టు వెల్ల‌డించారు.

అయితే ఇవేవీ తెలియ‌కుండా న‌వాజుద్దీన్ తాను పెళ్లి చేసుకున్న‌ట్టు వాపోయారు. ఇప్పుడు తాను కూడా మొద‌టి భార్య మాదిరిగానే శారీర‌క‌, మాన‌సిక హింస‌ను న‌వాజుద్దీన్ నుంచి ఎదుర్కోవాల్సి వ‌చ్చింద‌ని ఆరోపించారు. అందుకే తాను కూడా విడాకులు తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ఆలియా తెలిపారు.

విడాకుల ప‌త్రాల‌ను ఇప్ప‌టికే వాట్సాప్‌, ఈ-మెయిల్స్ ద్వారా న‌వాజుద్దీన్‌కు పంపిన‌ట్టు ఆమె తెలిపారు. న‌వాజుద్దీన్ కుటుం బాన్ని కూడా ఆమె వ‌దిలిపెట్ట‌లేదు. ఇంకా ఆమె ఏమ‌న్నారంటే…

“ఆత్మాభిమానం విషయంలో నేను తీవ్రంగా దెబ్బతిన్నాను. నవాజుద్దీన్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా అతని తమ్ముడు షమాస్ నన్ను తీవ్రంగా ఇబ్బందిపెట్టాడు. నవాజ్ కుటుంబ సభ్యులందరూ నన్ను మానసికంగా, శారీరకంగా హింసించారు. అందుకే ఈ బంధాన్ని తెంచుకుని నా పాత జీవితాన్ని కొత్తగా ప్రారంభించబోతున్నా. నా ఇద్దరి పిల్లల్ని నేనే చూసుకుంటా” అని ఆలియా ఎంతో భావోద్వేగంతో చెప్పుకొచ్చారు. 

ప్రతిపక్ష నేతగా బాబు చేసిందేంటి..?