సరైన కాన్సెప్ట్ పట్టుకుని, దాని చుట్టూ సరైన పాత్రలు అల్లుకుని కథ తయారు చేసుకోవాలే కానీ భలేగా వుంటుంది. ఏనాడో జరిగిన స్కైలాబ్ ఇన్సిడెంట్ ను పట్టుకుని, చిత్రాతి చిత్రమైన పాత్రలను ఊహించి, కథ తయారు చేసుకున్నాడు దర్శకుడు విష్వక్ ఖండేరావ్. సినిమాను డెభయ్యవ దశకం లోకి తీసుకుపోయి, చిత్రమైన పాత్రలు అన్నీ చూపించాడు.
నిత్య మీనన్, సత్య, రాహుల్ రామకృష్ణ పాత్రలు ట్రయిలర్ లో చూస్తుంటే కచ్చితంగా సినిమాలో సమ్ థింగ్ వుంది అనిపించేలా వున్నాయి. నిత్య మీనన్ ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్ అని పేర్కొన్నారు. కథ నచ్చిన నిత్య తనంతట తాను పార్టనర్ షిప్ తీసుకుందీ సినిమాలో. ఇలా చేయడం ఇది తొలిసారి.
నిత్య గెటప్ కూడా భలేగా వుంది. ఈ మధ్యకాలంలో ఆమెకు మంచి పాత్ర రాలేదు. స్కైలాబ్ సినిమా పెద్దగా హడావుడి, పబ్లిసిటీ లేకుండానే వుంది ఇప్పటి వరకు. ఈ ట్రయిలర్ వచ్చిన తరువాత మాత్రం కచ్చితంగా మాట్లాడుకునేలా వుంది.
పృధ్వీ పిన్నంరాజు నిర్మించిన ఈ సినిమా షూట్ చేసిన కలర్ స్కీమ్ కూడా సినిమా పీరియడ్ కు తగినట్లు వుంది.