విశాఖ పాలనా రాజధానికి గుర్తింపు…?

అదేంటి మూడు రాజధానుల విషయం కోర్టులో ఉండగా మరో వైపు అమరావతి రైతులు మహా పాదయాత్ర చేస్తూండగా విశాఖకు పాలనా రాజధాని గుర్తింపు రావడం ఏంటి అన్న డౌట్ ఎవరికైనా రావచ్చు. అయితే ఇది…

అదేంటి మూడు రాజధానుల విషయం కోర్టులో ఉండగా మరో వైపు అమరావతి రైతులు మహా పాదయాత్ర చేస్తూండగా విశాఖకు పాలనా రాజధాని గుర్తింపు రావడం ఏంటి అన్న డౌట్ ఎవరికైనా రావచ్చు. అయితే ఇది వేరే విషయం.

విశాఖను పాలనా రాజధానిగా వైసీపీ సర్కార్ ప్రకటించిన నేపధ్యంలో విశాఖ తూర్పు నావికా దళం ముంబైకి చెందిన ఒక యుద్ధ నౌకకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సిటీ అన్న పేరు పెట్టిందట. ఆ యుద్ధ నౌక విశాఖలో త్వరలో విన్యాసాలు చేస్తుందిట. ముఖ్యంగా డిసెంబర్ 4న విశాఖలో ప్రతీ ఏటా జరిగే నేవీ డే లో ఈ యుద్ధ నౌక అతి పెద్ద ఫోకస్ అవుతుంది అంటున్నారు.

ఇదిలా ఉంటే జగన్ విశాఖ రావాల్సిన అవసరం మరో మారు పడుతోంది. డిసెంబర్ 4న నేవీ డే ఉత్సవాలను తిలకించడానికి నేవీ అధికారులు ఆయనకు ఆహానం పలికారు. అదే టైమ్ లో వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సిటీ నౌక విన్యాసాలను కూడా ఆయన స్వయంగా తిలకించాల్సి ఉంది. 

మొత్తానికి విశాఖకు పాలనా రాజధాని తరలివచ్చే కంటే ముందే యుద్ధ నౌక మాత్రం అదే పేరుతో రావడం విశేషం. ఇది ఒక విధంగా నగర వాసులకు ఆనందం కలిగించే మ్యాటరే అంటున్నారు అంతా.