దక్షిణాదిన పలువురు సినిమా వాళ్లు పెళ్లిళ్లు చేసుకోవడానికి ముందు జంటగా వివిధ దేవాలయాలను సందర్శించిన దాఖలాలు ఉన్నాయి. పెళ్లి చేసుకోవడానికి ముందు వివిధ ఆలయాలను సందర్శించి దోష నివారణ పూజలు చేయించుకున్న వాళ్లు, జంటగా ఆలయాలకు వెళ్లిన కొంత కాలానికి పెళ్లి చేసుకున్న వాళ్లు ఇది వరకూ కొంతమంది ఉన్నారు.
ఈ జాబితాలోకి ఎప్పుడు చేరుతుందో కానీ.. నటీమని నయనతార వివిధ ఆలయాల సందర్శనలో బిజీగా ఉంది. ప్రియుడు విఘ్నేష్ శివన్ తో జంటగా ఆమె ఆలయాల సందర్శన చేస్తూ ఉంది. కన్యాకుమారిలోని వివిధ ఆలయాలను నయనతార దర్శించుకుంది. విఘ్నేశ్, నయనతార జంట దైవ దర్శనాలను చేసుకుంటూ ఉందక్కడ. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కొత్తవేవీ కాదని చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో ఈ జంట అలయాల సందర్శనతో బిజీగా ఉంది.
పుట్టుకతో క్రైస్తవరాలు అయిన నయనతార తను ప్రేమించిన వ్యక్తుల కోసం దేవాలయాల దర్శనానికి వెళ్తూ ఉంది. గతంలో ప్రభుదేవాతో పాటు కూడా నయనతార ఆలయాల సందర్శన చేసింది. అయితే ఆ ప్రేమ గట్టెక్కలేదు. ఇప్పుడు విఘ్నేష్ తో ఆమె ఆలయాలకు వెళ్తూ ఉంది.