నయనతార పుట్టినరోజు.. సమంత స్పెషల్ గెస్ట్

వీళ్లిద్దర్లో ఎవరు పుట్టినరోజు జరుపుకున్నా ఆ సంబరం వేరే లెవెల్లో ఉంటుంది. విఘ్నేష్ ప్రతి బర్త్ డేను విదేశాల్లో సెలబ్రేట్ చేసింది నయనతార. కరోనా టైమ్ లో తప్ప, మిగతా అన్ని సందర్భాల్లో వీళ్లు…

వీళ్లిద్దర్లో ఎవరు పుట్టినరోజు జరుపుకున్నా ఆ సంబరం వేరే లెవెల్లో ఉంటుంది. విఘ్నేష్ ప్రతి బర్త్ డేను విదేశాల్లో సెలబ్రేట్ చేసింది నయనతార. కరోనా టైమ్ లో తప్ప, మిగతా అన్ని సందర్భాల్లో వీళ్లు విదేశాలకు చెక్కేశారు. ఈసారి నయనతార బర్త్ డే వచ్చింది. దీంతో విఘ్నేష్ కు పండగొచ్చింది. ఆమె పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు కాబోయే భర్త విఘ్నేష్.

సరిగ్గా రాత్రి 12 గంటలకు నయనతార కోసం పెద్ద పార్టీ ఎరేంజ్ చేశాడు విఘ్నేష్. ఈ పార్టీకి చాలా తక్కువమందిని మాత్రమే ఆహ్వానించారు. వాళ్లలో సమంత కూడా ఒకరు. అంతా కలిసి ఆమె పుట్టినరోజును సెలబ్రేట్ చేశారు.

నయన్ అంటూ ఇంగ్లిష్ అక్షరాలతో తయారుచేసిన పెద్ద కేక్ ను తన ప్రేయసి కోసం ఆర్డర్ చేశాడు విఘ్నేష్. భారీ ఎత్తున టపాసులు కూడా కాల్చాడు. తన కోసం ప్రియుడు చేసిన ఏర్పాట్లు చూసి నయన్ పులకించిపోయింది. కేక్ కట్ చేసే ముందు విఘ్నేష్ ను గట్టిగా హత్తుకుంది.

నయన్-విఘ్నేష్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రారంభంలో సీక్రెట్ మెయింటైన్ చేసినప్పటికీ తర్వాత తమ బంధాన్ని బయటపెట్టారు. కానీ పెళ్లి మాత్రం చేసుకోవడం లేదు. ఈరోజు తన 39వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్న నయనతారకు శుభాకాంక్షలు చెబుతూనే.. వచ్చే బర్త్ డే నాటికి విఘ్నేష్ ను పెళ్లి చేసుకోవాలని కోరుతున్నారు ఆమె ఫ్యాన్స్.

ఈ బర్త్ డేకి స్పెషల్ ఏంటంటే.. ఆమె బాలీవుడ్ మూవీ చేస్తోంది. అట్లీ దర్శకత్వంలో షారూక్ హీరోగా రాబోతున్న సినిమాలో ఆమె నటిస్తోంది. నయనతార బాలీవుడ్ డెబ్యూ ఇది.