బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ సినిమాలో అవకాశం వస్తే ఎవరైనా నో చెబుతారా? మరీ ముఖ్యంగా సౌత్ హీరోయిన్లకు ఆ ఛాన్స్ వస్తే కాదంటారా? కానీ ఇక్కడో ముద్దుగుమ్మ మాత్రం నో చెప్పేసింది. అవును.. షారూక్ సినిమాలో నటించే అవకాశం వస్తే తిరస్కరించింది నయనతార.
రోహిత్ శెట్టి డైరక్షన్ లో చెన్నై ఎక్స్ ప్రెస్ అనే సినిమా చేశాడు షారూక్ ఖాన్. దీపిక పదుకోన్ ఇందులో హీరోయిన్ గా నటించింది. ఈ ప్రాజెక్టు కోసం నయనతారను సంప్రదించారు మేకర్స్. అయితే హీరోయిన్ పాత్ర కోసం కాదు. సినిమాలో ఐటెంసాంగ్ కోసం నయనతారను అడిగారు.
కెరీర్ స్టార్టింగ్ లో స్పెషల్ సాంగ్స్ చేసిన నయనతార, స్టార్ డమ్ వచ్చిన అలాంటి పాటలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. సరిగ్గా అదే టైమ్ లో చెన్నై ఎక్స్ ప్రెస్ ఆఫర్ రావడంతో.. షారూక్ సినిమా అయినప్పటికీ ఐటెంసాంగ్ చేసేందుకు నో చెప్పింది ఈ ముద్దుగుమ్మ. పైగా అదే టైమ్ లో వరుస సినిమాలతో ఆమె బిజీగా ఉంది.
నయనతార నో చెప్పడంతో ఆ పాట కోసం ప్రియమణిని తీసుకున్నారు. సినిమాలో సాంగ్ మంచి హిట్టయింది. కానీ బాలీవుడ్ లో అవకాశాలొస్తాయని భావించిన ప్రియమణికి మాత్రం అది కలిసిరాలేదు.