ఆ హాట్ కపుల్ కలిసి సినిమా చేసేది ఎప్పుడు?

బుల్లితెరపై హాట్ జోడీ ఎవరంటే కచ్చితంగా వినిపించే కాంబినేషన్ రష్మీ-సుడిగాలి సుధీర్. వీళ్లిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అమోఘం. వీళ్లిద్దరి మధ్య ఏదో వ్యవహారం సాగుతోందని ఇప్పటికీ చాలామంది అనుమానిస్తారు. అంతలా రష్మి-సుధీర్ తెరపై…

బుల్లితెరపై హాట్ జోడీ ఎవరంటే కచ్చితంగా వినిపించే కాంబినేషన్ రష్మీ-సుడిగాలి సుధీర్. వీళ్లిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అమోఘం. వీళ్లిద్దరి మధ్య ఏదో వ్యవహారం సాగుతోందని ఇప్పటికీ చాలామంది అనుమానిస్తారు. అంతలా రష్మి-సుధీర్ తెరపై కలిసిపోతారు.

అలాంటి ఈ హాట్ జోడీని వెండితెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చాన్నాళ్లుగా జరుగుతున్నాయి. కానీ ఇప్పటివరకు ఏదీ వర్కవుట్ కాలేదు. తామిద్దరం కలిసి ఎందుకు సినిమా
చేయలేకపోతున్నామో స్వయంగా రష్మి బయటపెట్టింది.

“మా ఇద్దర్నీ హీరోహీరోయిన్లుగా పెట్టి సినిమాలు చేయడానికి చాలామంది వస్తున్నారు. కానీ మంచి కథ సెట్ అవ్వడం లేదు. అలాంటి కథ సెట్ అయినప్పుడు కచ్చితంగా మేమిద్దరం సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తాం. మా ఇద్దరికీ సమ ప్రాధాన్యం దక్కేలా, కమర్షియల్ గా ఏదైనా కథ సెట్ అయితే కచ్చితంగా చేస్తాం.”

ఈమధ్య సుడిగాలి సుధీర్ హీరోగా మారాడు. ఆ సినిమాలో రష్మినే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో మరో హీరోయిన్ ను తీసుకున్నారు. త్వరలోనే మరో సినిమా కూడా చేయబోతున్నాడు సుధీర్. కనీసం అందులోనైనా ఈ జంట అలరిస్తుందేమో చూడాలి.

మరోవైపు సుధీర్ గురించి రష్మి మాట్లాడుతూ.. తను చూసిన వ్యక్తుల్లో మోస్ట్ రొమాంటిక్ వ్యక్తి సుధీర్ అని కితాబిచ్చింది. సుధీర్ ఎవ్వరితో డేటింగ్ చేసినా, పెళ్లి చేసుకున్నా మొదటి 6 నెలలు ఆ అమ్మాయికి సినిమాటిక్ లైఫ్ చూపిస్తాడని చెబుతోంది రష్మి.

వైయస్ఆర్ ఆరోగ్య శ్రీ సేవల విస్తరణ