మెగా కుటుంబం నుంచి హీరోయిన్‌గా నాగబాబు ముద్దుల కూతురు నిహారిక పరిచయం అయ్యారు. టాలీవుడ్‌లో మెగా వారస త్వాన్ని ఎంట్రీగా మాత్రమే ఆమె భావించారు. ఆ తర్వాత ప్రతిభతో తనను తాను నిరూపించుకోవాలని ఎంతో శ్రమిస్తున్నారామె. ముఖంపై చెరగని చిరునవ్వు ఆమె సొంతం.
కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్స్ అంటే హీరోహీరోయిన్లు హడలిపోతున్నారు. సోషల్ మీడియాలో అభిమానులతో చిట్‌చాట్ చేస్తూ కాలం గడుపుతున్నారు. నిహారిక కూడా అదే పని చేస్తున్నారు. ఏ మాత్రం అరమరికలు లేకుండా ఆమె మాట్లాడేస్తుంటారు. సోషల్ మీడియాలో ఆమె అభిమానులతో ముచ్చట్లు చెప్పారు.
ఈ సందర్భంగా ఓ నెటిజన్ మీ ముఖంపై పింపుల్ గమనించా అని కామెంట్ పెట్టాడు. దానికి నిహారిక తనదైన స్టైల్‌లో సమాధానం ఇచ్చారు. “కంగ్రాట్స్. అవార్డ్ ఇంటికి పంపిస్తా” అని సరదాగా కామెంట్ చేశారామె.
మరో నెటిజన్ “మీ ఫోన్ వాల్ పేపర్ ఏంటి” అని ప్రశ్నించాడు. “కాబోయే భర్త చైతన్యతో దిగిన ఫొటోను వాల్ పేపర్‌గా పెట్టుకున్నా” అని ఆమె జవాబిచ్చారు. ఇలా నిహారిక తన అభిమానులు, నెటిజన్స్ అడిగిన ప్రశ్నలన్నింటికి ఆసక్తికర జవాబులిచ్చారు.
గుంటూరు ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యతో నిహారిక పెళ్లి నిశ్చయమైన విషయం తెలిసిందే. తన కాబోయే జీవిత భాగస్వామి గురించి ఒక్కో రోజు ఒక్కో హింట్ ఇస్తూ చివరికి నిహారిక తెరదించిన వైనం ఆసక్తి కలిగించింది. త్వరలో చైతన్యతో కలిసి ఆమె ఏడడుగులు వేయనున్నారు.