సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. దాదాపు మూడేళ్లుగా వీళ్లు రిలేషన్ షిప్ లో ఉన్నారు. గతేడాది లాక్ డౌన్ టైమ్ లో పెళ్లి చేసుకుంటారని అంతా భావించారు. ఒకవేళ పెళ్లి చేసుకోకపోయినా, కనీసం నిశ్చితార్థమైనా పూర్తవుతుందని భావించారు. కానీ అలాంటిదేం జరగలేదు.
ఉన్నట్టుంది సడెన్ గా ఈరోజు పొద్దున్నే ఓ ఫొటో పోస్ట్ చేశాడు విఘ్నేష్ శివన్. కేవలం నయనతార చేతికి ఉన్న ఉంగరం కనిపించేలా ఆ ఫోటో ఉంది. తామిద్దరికి ఎంగేజ్ మెంట్ పూర్తయిందనే అర్థం వచ్చేలా ఈ ఫొటో పెట్టాడు విఘ్నేష్.
దీనిపై ఇప్పటికే కోలీవుడ్ మీడియా త్రవ్వకాలు మొదలుపెట్టింది. తాజాగా వీళ్లిద్దరి ఎంగేజ్ మెంట్ పూర్తయి ఉంటుందని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం రెండేళ్ల కిందటే వీళ్లిద్దరికీ నిశ్చితార్థం అయిందని, కేవలం ఆ విషయాన్ని ఇప్పుడు అధికారికంగా ప్రకటించారని అంటున్నారు. ఎవరేమన్నా వీళ్లిద్దరి నిశ్చితార్థం పూర్తయిందనే విషయం మాత్రం ఈ ఫొటోతో నిర్థారణ అయింది.
చూస్తుంటే ఈ ఏడాదిలోనే నయనతార-విఘ్నేష్ పెళ్లి చేసుకునేలా ఉన్నారు. ప్రస్తుతం నయనతార వరుస సినిమాలతో బిజీగా ఉంది. సౌత్ లోనే అత్యథిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా ఆమె గుర్తింపు తెచ్చుకుంది.