ఆర్ఆర్ఆర్: 5 భాషలు.. 348 కోట్లు

ఆర్ఆర్ఆర్ రికార్డుల మోత మొదలైంది. ఈ సినిమాకు సంబంధించి ప్రీ-రిలీజ్ బిజినెస్ ను కొన్ని రోజుల కిందట స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. భాషల వారీగా, ప్రాంతాల వారీగా థియేట్రికల్ బిజినెస్ డీల్స్ క్లోజ్…

ఆర్ఆర్ఆర్ రికార్డుల మోత మొదలైంది. ఈ సినిమాకు సంబంధించి ప్రీ-రిలీజ్ బిజినెస్ ను కొన్ని రోజుల కిందట స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. భాషల వారీగా, ప్రాంతాల వారీగా థియేట్రికల్ బిజినెస్ డీల్స్ క్లోజ్ చేస్తున్నారు. 

ఇందులో భాగంగా కేవలం 5 భాషలకు సంబంధించి 348 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ డీల్స్ క్లోజ్ చేసింది యూనిట్. ఈ మొత్తం దాదాపు మూవీ బడ్జెట్ తో సమానం.

తెలుగు-హిందీ భాషల్లో సైమల్టేనియస్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఒకేసారి 11 భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. 

సమయం కుదిరితే ఇతర భాషల్లో కూడా డబ్బింగ్ చేసి ఒకేసారి విడుదల చేయాలని ప్లాన్. అటు నాన్-థియేట్రికల్ బిజినెస్ లో కూడా ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. 

శాటిలైట్, డిజిటల్, ఆడియోతో పాటు ఇతర హక్కులన్నీ కలిపి 250 కోట్ల రూపాయలు ఆశిస్తోంది యూనిట్. స్టార్ మా, అమెజాన్ ప్రైమ్ లాంటి పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఇంకా ఎక్కడా డీల్ లాక్ అవ్వలేదు. మరో వారం రోజుల్లో ఈ డీల్ పై క్లారిటీ వస్తుంది.

350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు 700 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ (నాన్-థియేట్రికల్ రైట్స్ తో కలిపి) చేసే అవకాశం ఉంది. అక్టోబర్ 13న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది ఆర్ఆర్ఆర్ మూవీ.