తను మరోసారి గర్భం దాల్చిన విషయాన్ని నిన్న బయటపెట్టింది మాజీ హీరోయిన్ నేహా ధూపియా. త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నానని, భర్త అంగద్ బేడీకి కరోనా పాజిటివ్ రావడం, తను గర్భం దాల్చడం ఒకేసారి జరిగాయంటూ చాలా ఎమోషనల్ అయింది. అయితే నేహా ధూపియాకు ఆ ఆనందాన్ని ఎక్కువ సేపు ఉంచలేదు ఓ నెటిజన్. ఓ చెత్త కోరిక కోరి, ఆమె మూడ్ మొత్తం చెడగొట్టాడు.
ఈసారి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బిడ్డకు పాలు పెడుతున్న వీడియోను షేర్ చేయమని ఓ నెటిజన్ కోరాడు. ఆ పోస్ట్ చూసిన వెంటనే నేహా ఆనందం మాయమైంది. ఆమెలో కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చింది. అలాంటి వీడియో కావాలంటే తనను అడగాల్సిన అవసరం లేదని, మీ అమ్మ లేదా అమ్మమ్మను అడిగితే వాళ్లు చూపిస్తారంటూ గట్టిగా సమాధానం ఇచ్చింది.
సదరు నెటిజన్ తన మూడ్ మొత్తం చెడగొట్టాడన్న నేహా ధూపియా.. సాధారణంగా నెగెటివ్ పోస్టుల్ని తను డిలీట్ చేయడం లేదా వదిలేయడం చేస్తానని.. కానీ ఈ నెటిజన్ పెట్టిన పోస్టును వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సమాధానం ఇచ్చానని స్పష్టత ఇచ్చింది.
మాతృత్వాన్ని కూడా కామంతో చూసే ఇలాంటి వాళ్లు ఉన్నంతవరకు సమాజం బాగుపడదని రాసుకొచ్చింది. తొలిసారి తల్లి అయిన యువతులు పాలిచ్చే సమయంలో ఎంతో ఇబ్బందిని ఎదుర్కొంటారని, ఆ ఇబ్బందుల్ని గుర్తించి, వాళ్లకు సహకారం అందించేలా సమాజం మారాలని హితవు పలికింది.
నేహా ధూపియా తొలిసారి గర్భం దాల్చే సమయానికి ఆమెకు పెళ్లి కాలేదు. అంగద్ తో డేటింగ్ చేసిన టైమ్ లోనే ఆమె ప్రెగ్నెంట్ అయింది. అప్పటికి ఆమె చేతిలో 2 సినిమాలు కూడా ఉన్నాయి. ఓవైపు గర్భాన్ని కొనసాగిస్తూ, మరోవైపు సినిమాలు పూర్తిచేస్తూ, ఇంకోవైపు అంగద్ ను రహస్యంగా వివాహం చేసుకుంది. ఈసారి నేహాకు అలాంటి ఇబ్బందుల్లేవు.