నేలకొండ భగవత్ కేసరి..ఎన్ బి కె

నందమూరి బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా భగవత్ కేసరి. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు.  Advertisement బాలయ్య స్టయిల్ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా…

నందమూరి బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా భగవత్ కేసరి. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. 

బాలయ్య స్టయిల్ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా గా ఈ సినిమాను తయారు చేస్తున్నట్లు టీజర్ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. బాలయ్య మోడ్ లోకి అనిల్ రావిపూడి పూర్తిగా మారిపోయినట్లు టీజర్ చెప్పేసింది. కానీ అదే టీజర్ లో ఇచ్చిన ఫినిషింగ్ టచ్ మాత్రం, అనిల్ రావిపూడి స్టయిల్ ను దాచాం..లోపల ఇంకా చాలా వుంది అన్నట్లు చెప్పేసారు.

కళ్లలో కళ్లు పెట్టి చూడు సాంగ్ ను బాలయ్య మీద కొత్తగా ప్లే చేసారు అంటే అనిల్ రావిపూడి ఎంటర్ టైన్ మెంట్ వ్యవహారమే. కానీ అంతకు ముందు టీజర్ లో మొండివాడు రాజకన్నా బలవంతుడు అనే మీనింగ్ వచ్చే డైలాగు, బాలయ్య స్టయిల్ హిందీ డైలాగు, మాంచి భారీ యాక్షన్ కట్, ఓ మాస్ గ్రూప్ సాంగ్ బిట్ ఇవన్నీ మాస్ కోసం అందించిన ఫుల్ మీల్సే అనుకోవాలి.

థమన్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ ఓకె. సినిమా మీద అంచనాలు పెంచడానికి మాంచి మార్కెట్ రప్పించడానికి టీజర్ పక్కాగా ఉపయోగపడేలా వుంది.